
‘బీబీసీ అవార్డు’ రేసులో పీవీ సింధు
న్యూఢిల్లీ: రెండు ఒలింపిక్ పతకాల విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రెండోసారి ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో నిలిచింది. 2020లో సింధుకు ఈ అవార్డు లభించింది. ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్ బీబీసీ మంగళవారం విడుదల చేసిన 2022 నామినీల్లో తెలుగు తేజంతో పాటు టోక్యోలో రజతం నెగ్గిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సింగ్‌లో కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్, గోల్ఫర్ అదితి అశోక్, పారాలింపియన్ షూటర్ అవనీ లేఖరా ఉన్నారు.
ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఈ నెల 28 వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. మార్చి 28న ఏర్పాటు చేసే కార్యక్రమంలో విజేతను ప్రకటిస్తారు. 2021 సంవత్సరంలో భారత చెస్ దిగ్గజం కోనేరు హంపికి ఈ అవార్డు లభించింది.