NADA Dope Test
-
రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు..
భారత స్టార్ రెజర్, ఒలింపిక్ విజేత బజరంగ్ పునియాకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA ) మరోసారి బిగ్ షాకిచ్చింది. బజరంగ్ పూనియాపై నాడా సస్పెన్షన్ వేటు వేసింది. బజరంగ్ పునియా డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు నాడా ఆదివారం సస్పెండ్ చేసింది. అతడికి తాజాగా జాతీయ డోప్ కంట్రోల్ ఏజెన్సీ నోటీసు అందజేసింది.అసలేం జరిగిందంటే?ఈ ఏడాది మార్చిలో సోనిపట్‌లో జరిగిన ఒలింపిక్స్ ట్రయల్స్‌లో రోహిత్ కుమార్‌పై బజరంగ్ పునియా ఓడిపోయాడు. ఆ తర్వాత బజరంగ్ పూనియాపై డోపింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్ అతడి నమూనాలను సేకరించేందుకు ప్రయత్నించింది. కానీ పునియా మాత్రం యూరిన్ శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. ఈ క్రమంలో నాడా.. ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ(వాడా)కు పూనియా వ్యవహరం తెలియజేసింది.దీంతో బజరంగ్ ఎందుకు శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించాడో వివరణ కోరుతూ నోటీసు ఇవ్వమని ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ.. నాడాకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో నాడా ఏప్రిల్ 26లోపు తన వివరణ ఇవ్వాలని పూనియాకు నోటీసు జారీ చేసింది. కానీ పూనియా నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అయినప్పటకి నాడా మళ్లీ మే 7లోపు వివరణ ఇవ్వాలని నోటీసు జారీ చేసింది. ఆ నోటీసులకు కూడా పూనియా సమాధానమివ్వలేదు. దీంతో గత నెలలో అతడిపై తాత్కాలిక నిషేదం విధించింది.అయితే నాడా నోటీసులకు స్పదించని పూనియా.. నాడా క్రమశిక్షణ సంఘంకు మాత్రం తన వివరణ ఇచ్చాడు. డోపింగ్ టెస్టుకు శాంపిల్స్ ఇవ్వడానికి తానెప్పుడూ తిరస్కరించలేదని, పరీక్షల కోసం నాడా అధికారులు గడువు దాటిన కిట్లను వాడడంతోనే నమూనాలను ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. దీంతో జూన్4న బజరంగ్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) విధించిన సస్పెన్షన్‌ను నాడా క్రమశిక్షణ సంఘం (ఏడీడీపీ) తాత్కాలికంగా ఎత్తివేసింది. అయితే అతడు కావాలనే డోప్ టెస్టు తప్పించుకుంటున్నాడని భావించిన నాడా మరోసారి అతడిపై నిషేదం విధించింది. జూలై 11 లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో నాడా పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
భారత టాప్ రెజ్లర్‌పై సస్పెన్షన్ వేటు
భారత టాప్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత భజరంగ్ పూనియాపై అంతర్జాతీయ రెజ్లింగ్ సంస్థ (United World Wrestling) సస్పెన్షన్ వేటు వేసింది. డోప్ పరీక్షకు నిరాకరించినందుకు NADAచే తాత్కాలికంగా సస్పెండ్ చేయబడిన తర్వాత పునియాను UWW సస్పెండ్ చేసింది. పూనియాపై ఈ ఏడాది చివరి వరకు (డిసెంబర్ 31) సస్పెన్షన్ కొనసాగనుంది.డోప్ టెస్ట్‌కు నిరాకరించాడన్న కారణంగా 20 ఏళ్ల పూనియాను ఏప్రిల్ 23న NADA సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌పై పూనియా అప్పుడే స్పందించాడు. తాను శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించలేదని వివరణ ఇచ్చాడు. శాంపిల్ తీసుకునేందుకు నాడా అధికారులు గడువు ముగిసిన కిట్‌ను ఉపయోగిస్తుండటంతో అందుకు వివరణ మాత్రమే కోరానని తెలిపాడు.UWW సస్పెన్షన్ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని పూనియా తాజాగా వివరణ ఇచ్చాడు. పూనియా స్టేట్మెంట్పై UWW సైతం స్పందించింది. పూనియాను సస్పెండ్ చేస్తున్న విషయాన్ని కారణాలతో సహా అతని ప్రొఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నామని తెలిపింది. ఒకవేళ పూనియాపై సస్పెన్షన్ వేటు నిజమే అయితే ఈ ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో భారత పతక అవకాశాలకు గండి పడినట్లే. -
డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడ్డ భారత స్టార్ వెయిట్ లిఫ్టర్
భారత క్రీడారంగంలో మరోసారి డోపింగ్ కలకలం రేగింది. స్టార్ మహిళా వెయిట్ లిఫ్టర్, రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత కుముక్చమ్ సంజిత చాను (మణిపూర్) డోపింగ్ టెస్ట్‌లో విఫలమైంది. ఆమె నుంచి సేకరించిన శాంపుల్స్‌లో నిషేధిత ఉత్ప్రేరకం డ్రొస్టనొలోన్ను గుర్తించినట్లు డోపింగ్ నిరోధక అధికారులు (డీసీఓ) వెల్లడించారు. దీంతో సంజితపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ప్రాథమిక నిషేధం విధించింది. శాంపిల్ సేకరించిన నాటి నుంచే సంజితపై నిషేధం అమల్లో ఉంటుందని నాడా పేర్కొంది. కాగా, గతేడాది జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా సంజిత నుంచి శాంపుల్స్ సేకరించారు. ఆ పోటీల్లో 49 కేజీల విభాగంలో పోటీపడ్డ సంజిత రజత పతకం కైవసం చేసుకుంది. ఈ పోటీలో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను స్వర్ణం నెగ్గింది. -
భారత్‌కు వరుస షాక్‌లు.. డోప్ టెస్ట్‌లో పట్టుబడ్డ మరో అథ్లెట్
Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్ వేదికగా ఈనెల 28 నుంచి ప్రారంభంకానున్న కామన్వెల్త్ క్రీడా సంగ్రామానికి ముందు భారత్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే నలుగురు అథ్లెట్లు డోప్ టెస్ట్‌లో విఫలమై మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించగా.. తాజాగా మరో అథ్లెట్‌కు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నిర్వహించిన డోప్ టెస్ట్‌లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. మహిళల 4x100 మీటర్ల బృందంలోని మరో సభ్యురాలు (ఇదివరకే ఈ విభాగంలో ఓ సభ్యురాలు డోప్ టెస్టులో విఫలమైంది) డోప్ టెస్ట్‌లో పట్టుబడినట్లు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ధృవీకరించారు. అయితే ఆ అథ్లెట్ పేరు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. కాగా, గతవారం ఇద్దరు పారా అథ్లెట్లు (అనీష్ కుమార్, సురేంద్రన్ పిళ్లై) సహా మరో ఇద్దరు భారత అథ్లెట్లు (స్ప్రింటర్ ధనలక్ష్మీ, ట్రిపుల్ జంపర్ ఐశ్యర్య బాబు) డోప్ టెస్ట్‌లో విఫలమైన విషయం తెలిసిందే. తాజా ఘటనతో భారత బృందంలో డోపీల సంఖ్య 5కు చేరింది. చదవండి: డోపింగ్‌లో దొరికిన ‘కామన్వెల్త్’ అథ్లెట్లు -
డోపింగ్‌లో పట్టుబడ్డ జాతీయ స్ప్రింట్ చాంపియన్..
అండర్–23 విభాగంలో భారత జాతీయ స్ప్రింట్ మహిళా చాంపియన్ తరణ్‌జీత్ కౌర్ డోపింగ్ పరీక్షలో విఫలమైందని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తెలిపింది. ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల తరణ్‌జీత్ గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన జాతీయ అండర్–23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్లు, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు నెగ్గింది. ‘నాడా’ క్రమశిక్షణ కమిటీ విచారణలోనూ తరణ్‌జీత్ దోషిగా తేలితే ఆమెపై నాలుగేళ్ల నిషేధం విధిస్తారు. చదవండి: రషీద్ ఖాన్ కుటంబంలో తీవ్ర విషాదం.. -
సత్నాం సింగ్‌పై రెండేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జాతీయ బాస్కెట్‌బాల్ సంఘం (ఎన్బీఏ) జట్టుకు భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన తొలి బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా ఘనతకెక్కిన సత్నాం సింగ్ భమారా డోపింగ్‌లో దొరికిపోయాడు. దీంతో 25 ఏళ్ల భమారాపై రెండేళ్ల నిషేధం విధిస్తున్నట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) క్రమశిక్షణా ప్యానెల్ గురువారం ప్రకటించింది. బెంగళూరులో దక్షిణాసియా క్రీడల సన్నాహక శిబిరం సందర్భంగా గతేడాది నవంబర్‌లో నిర్వహించిన పరీక్షల్లోనే సత్నాం సింగ్ డోపీగా తేలడంతో రెండేళ్ల సస్పెన్షన్ వేటు వేశారు. దీన్ని సవాలు చేసిన సత్నాం డోపింగ్ నిరోధక క్రమశిక్షణా కమిటీ (ఏడీడీపీ)తో విచారణ జరిపించాలని ‘నాడా’ను కోరాడు. ఈ విచారణలో సత్నాం ‘వాడా’ నిషేధిత ఉత్ప్రేరకం హైజినమైన్ను తీసుకున్నట్లు తేలిందని ‘నాడా’ గురువారం నిర్ధారించింది. గతేడాది నవంబర్ నుంచే శిక్ష అమల్లోకి వస్తుందని పేర్కొన్న జాతీయ సంస్థ 19 నవంబర్ 2021 వరకు అతను ఎలాంటి టోర్నీల్లో ఆడరాదంటూ నిషేధం విధించింది. ఐదేళ్ల క్రితం ఎన్బీఏ డెవలప్మెంట్ లీగ్‌లో టెక్సాస్ లెజెండ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన భమారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయునిగా చరిత్ర సృష్టించాడు. ఆసియా చాంపియన్‌షిప్స్, 2018 కామన్వెల్త్ గేమ్స్, 2019 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. -
భారత్‌కు మరోసారి ఎదురుదెబ్బ!
-
నన్ను కావాలనే ఇరికిస్తున్నారు!
న్యూఢిల్లీ: జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) డోపింగ్ టెస్టుల్లో పట్టుబడిన ఇందర్జిత్ సింగ్ తనకు ఏపాపం తెలియదంటున్నాడు. షాట్ ఫుట్ విభాగంలో రియోలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న అథ్లెట్ ఇందర్జిత్ సింగ్ గతనెల 22న నాడా జరిపిన డోప్ టెస్టుల్లో 'ఏ' శాంపిల్స్ పాజిటివ్ గా వచ్చింది. ఆండ్రోస్టెరాన్, ఎటికోలనోలోన్ అనే రెండు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. దీంతో అతడి రియో అవకాశాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎవరో కావాలని తనపై కుట్రపన్నారని, తాను ఇచ్చిన శాంపిల్స్ లో ఏదో తేడా జరిగిందని అనుమానాలు వ్యక్తం చేశాడు. తనపై దుష్రచారం చేసి తన నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారని వాపోయాడు. ప్రస్తుతం తాను ఈ విషయంపై మాట్లాడేస్థితిలో లేనని, దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే వాళ్లు ఎలాంటి ఉత్ప్రేరకాలను తీసుకోరని షాట్ ఫుటర్ చెప్పాడు. తనను ఉద్దేశపూర్వకంగా డోపింగ్ వివాదంలో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించాడు. గతేడాది 50 సార్లు డోప్ టెస్టుల్లో పాల్గొన్నాను, ఈ ఏడాది కూడా అడిగిన ప్రతిసారి శాంపిల్స్ ఇచ్చానని ఇందర్జిత్ తెలిపాడు. అతడు 'బి' శాంపిల్స్ టెస్టు చేయించుకుని డోపింగ్ వివాదం బయటపడాల్సి ఉంటుంది. అయితే 'బి' శాంపిల్స్ లోనూ పాజిటివ్ వస్తే అతడిపై నిషేధంతో పాటు రియోకు వెళ్లకుంటా వేటు పడుతుంది. -
భారత్‌కు మరోసారి ఎదురుదెబ్బ!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే భారత్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆటగాళ్లు ఒక్కొక్కరిగా డోప్ టెస్టుల్లో దొరికిపోవడం రియో పతక అవకాశాలపై ప్రభావం చూపిస్తుంది. రియోలో పాల్గొననున్న భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) డోపింగ్ టెస్టుల్లో పట్టుబడిన కొన్ని రోజుల్లోనే, మరో ఆటగాడు డోప్ టెస్ట్ లో విఫలమయ్యాడు. షాట్ ఫుట్ విభాగంలో రియోలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న అథ్లెట్ ఇందర్జిత్ సింగ్ గతనెల 22న నాడా జరిపిన డోప్ టెస్టుల్లో దొరికిపోయాడు. తాజాగా డోప్ టెస్ట్ ఫలితాలలో అతడు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. దీంతో అతడి రియో అవకాశాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) ఈ విషయంపై అథ్లెటిక్ సమాఖ్యకు నేడు లేఖ రాయనుంది. ఆసియా చాంపియన్ షిప్, ఆసియా గ్రాండ్ ప్రీ, వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో గతేడాది పాల్గొన్న ఇందర్జిత్ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. రియోకు అర్హత సాధించిన తొలి అథ్లెట్ ఇలా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడటంతో భారత్ మరింత ఆందోళన చెందుతోంది. ఇంచియాన్ లో జరిగిన గేమ్స్ లో కాంస్య పతకాన్ని ఒడిసిపట్టాడు. ప్రస్తుతం అతడు అమెరికాలో శిక్షణ పొందుతున్నాడు. అథ్లెటిక్ సమాఖ్య ఇందర్జిత్ డోపీగా తేలడం విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.