భవానీపట్న (ఒడిశా): హాకీలో భారత పురుషుల, మహిళల జట్లు టోక్యో ఒలింపిక్స్‌లో ఆకట్టుకోగా... ఓ ఒడిశా యువకుడు మరో అరుదైన ఫీట్ చేశాడు. బొలాంగిర్ జిల్లాలోని జముత్‌జోలా గ్రామానికి చెందిన 25 ఏళ్ల రాజ్‌గోపాల్ భోయ్ కుడిచేతి చూపుడు వేలుపై ఏకంగా 3 గంటల 22 నిమిషాల 22 సెకన్లపాటు హాకీ స్టిక్‌ను నిలబెట్టాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నించాడు.
గిన్నిస్ నిబంధనల మేరకు సమయాన్ని నమోదుచేసే వారు, జడ్జిలు, వీక్షకుల సమక్షంలో... వీడియో చిత్రీకరణ జరుగుతుండగా... రాజ్‌గోపాల్ ఈ అరుదైన ఫీట్ చేశాడు. అత్యధిక సమయం చూపుడు వేలిపై హాకీ స్టిక్‌ను నిలబెట్టిన వరల్డ్ రికార్డు ప్రస్తుతం 2 గంటల 22 నిమిషాలతో బెంగళూరుకు చెందిన హిమాంశు గుప్తా పేరిట ఉంది.
రాజ్‌గోపాల్ విన్యాసానికి సంబంధించిన వీడియో రికార్డింగ్‌ను నిశితంగా అధ్యయనం చేసిన అనంతరం గిన్నిస్ వరల్డ్ రికార్డు వాళ్లు అతని ఘనతను గుర్తించి సర్టిఫికెట్ జారీచేయనున్నారు. శారీరకంగా, మానసికంగా ఎంతో శక్తి కావాలని... సంకల్పబలంతోనే ఇది సాధ్యమని ఈ ఫీట్‌కు నిర్వాహకునిగా వ్యవహరించిన సత్యపిర్ ప్రధాన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment