![16 Year old Hyderabad boy holds three world records in mountaineering](/styles/webp/s3/article_images/2024/12/5/32.jpg.webp?itok=cQB5fhzw)
సాక్షి, సిటీబ్యూరో: 16 ఏళ్లకే 16 వేలకుపైగా అడుగుల పర్వతాన్ని అధిరోహించి అరుదైన ఘనత సాధించాడు హైదరాబాద్‌కు చెందిన
విశ్వనాథ్ కార్తికేయ. అంటార్కిటికాలోని ఎత్తయిన శిఖరం మౌంట్ విన్సన్ మాసిఫ్(16,050 అడుగులు)ను అధిరోహించిన అతి పిన్న వయసు్కడైన భారతీయుడిగా రికార్డుల్లోకెక్కాడు. నిర్మల్ పుర్జా నేతృత్వంలో బూట్స్, క్రాంపాన్స్–ఎలైట్ ఎక్స్‌పెడ్ బృందంలో విశ్వనాథ్ ఈ నెల 3న శిఖరాగ్రానికి చేరుకున్నాడు.
అనంతరం సురక్షితంగా బేస్ క్యాంప్‌నకు చేరుకు న్నాడు. నవంబర్ 21న హైదరాబాద్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి, 25న యూనియన్ గ్లేసియర్‌కు చేరుకున్నాడు. అక్కడి వాతావరణానికి అలవాటు పడిన అనంతరం బేస్ క్యాంప్‌నకు తరలించారు. భిన్నమైన వాతావరణ పరిస్థితులు, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, లక్ష్యాన్ని సాధించాడు. ‘నీకు నచి్చంది చేయడం వల్ల సంతృప్తికరమైన, విజయవంతమైన జీవితం ఉంటుంది’అని తన తల్లి చెప్పేదని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment