
అష్టవక్రాసనంలో విజయ్
అనకాపల్లి: విశాఖ జిల్లా అనకాపల్లిలో పుట్టి చైనాలో యోగా గురువుగా ప్రఖ్యాతి గాంచిన కొణతాల విజయ్ గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించారు. చైనాలోని జెంజూ నగరంలో ఆగస్ట్ 4న అష్ట వక్రాసనాన్ని 2.32 నిమిషాలపాటు ప్రదర్శించి ఈ ఘనత సాధించారు. విజయ్ చదువుకునే సమయంలోనే యోగా నేర్చుకున్నారు. తర్వాత నృత్యంలో మెలకువలు సంపాదించి స్టార్ డ్యాన్సర్‌గా గుర్తింపు పొందారు. పలు దేశాల్లో డ్యాన్స్ శిక్షకుడిగా పనిచేసిన ఆయన చైనాలో స్థిరపడి నృత్యం, యోగ విద్యలో శిక్షణ ఇస్తున్నారు.
చదవండి: 17 నుంచి గుంటూరులో అగ్రి ఇన్ఫోటెక్–2021
భార్యాభర్తలిద్దరికీ గిన్నిస్‌బుక్‌లో స్థానం
విజయ్ భార్య జ్యోతి కొద్ది నెలల క్రితం గిన్నిస్‌బుక్‌లో స్థానం దక్కించుకున్నారు. నిండు గర్భంతో యోగాసనాలు వేసి ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు విజయ్‌కు కూడా అదే యోగాలో గిన్నిస్ బుక్‌లో స్థానం లభించడం గొప్పవిషయమని గిన్నిస్‌బుక్ ప్రతినిధులు పేర్కొన్నారు. చైనాలో కుంగ్ ఫూ, కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్‌లో ఎంతోమంది నిష్ణాతులు ఉంటారని, అక్కడ పోటీని తట్టుకొని యోగాసనాల్లో గిన్నిస్‌బుక్‌లో స్థానం పొందడం సంతోషంగా ఉందని విజయ్ ‘సాక్షి’తో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment