రికార్డులకు, అవార్డలుకు వయస్సుతో పనేముందని నిరూపించిందో బామ్మ. 99 ఏళ్ల వయసులో ఈజీగా ఈత కొట్టడం మాత్రమే కాదు. ఒకే రోజు ఏకంగా మూడు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. డచ్-కెనడియన్ బెట్టీ బ్రస్సెల్ ఈ నెల 20న అద్భుతమైన ఈ ఫీట్ సాధించింది. 400-మీటర్ల ఫ్రీస్టైల్, 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ 50-మీటర్ల బ్యాక్ అనే మూడు విభాగాల్లో తన సత్తా చాటింది. తనకు ఏజ్ అస్సలు మేటర్ కాదంటోంది.
ఇదీ చదవండి: ఏకంగా రూ.7 కోట్ల భూమిని విరాళమిచ్చిన మహిళ, ఎందుకో తెలుసా?
స్విమ్మింగ్ కెనడా లెక్కల ప్రకారం 12 నిమిషాల 50 సెకన్లతో ఉన్న 400-మీటర్ల ఫ్రీస్టైల్ రికార్డును దాదాపు నాలుగు నిమిషాల్లో బ్రేక్ చేసింది. అలాగే 50-మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ను ఐదంటే ఐదు సెకన్లలో ఛేదించి వాహ్వా అనిపించుకుంది. ‘‘నేను రేసులో ఉంటే ఇక దేన్నీ పట్టించుకోను. ఐ ఫీల్ లైక్ ఎ ఉమెన్!'‘ అని చెప్పిందామె. (Oyster Mushrooms: బెనిఫిట్స్ తెలిస్తే.. అస్సలు వదలరు!)
బ్రస్సెల్ 60 సంవత్సరాల వయస్సు నుండి మాత్రమే స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటూ ఉండటం విశేషం. కానీ ఇటీవలి అనేక ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన ఘనతను దక్కించుకుంది.
‘‘అమ్మా నీకు ముసలి తనం వచ్చేసిందని నా 70 ఏళ్ల చిన్న కొడుకుఅంటూ ఉంటాడు. కానీ నాకు అలా అనిపించదు. నిజంగా అలసి పోయినప్పుడు మాత్రం కొంచెం అనిపిస్తుంది. అంతే’’ అంటారామె. అలాగే రికార్డుల గురించి కూడా ఆలోచించను. చేయాల్సిన పనిని ధైర్యంగా చేసేస్తాను. గెలిస్తే సంతోషిస్తాను అంటుంది బోసి నవ్వులతో. బ్రస్సెల్స్ ఇప్పటికీ కనీసం వారానికి రెండుసార్లు స్విమ్మింగ్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment