ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు ఐదో పతకం లభించింది. కైరోలో జరుగుతున్న ఈ టోరీ్నలో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో సోనమ్ మస్కర్ రజత పతకం సాధించింది. మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల సోనమ్‌కు ఇదే తొలి ప్రపంచకప్ టోర్నీ కావడం విశేషం.
ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో సోనమ్ 252.1 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అనా జాన్సెన్ (జర్మనీ; 253 పాయింట్లు) స్వర్ణం, అనెటా స్టాన్‌కివిజ్ (పోలాండ్; 230.4 పాయింట్లు) కాంస్యం గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment