ISSF Shooting World Cup
-
ISSF World Cup: సోనమ్ మస్కర్కు రజత పతకం
ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ఐదో పతకం లభించింది. కైరోలో జరుగుతున్న ఈ టోరీ్నలో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో సోనమ్ మస్కర్ రజత పతకం సాధించింది. మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల సోనమ్‌కు ఇదే తొలి ప్రపంచకప్ టోర్నీ కావడం విశేషం. ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో సోనమ్ 252.1 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అనా జాన్సెన్ (జర్మనీ; 253 పాయింట్లు) స్వర్ణం, అనెటా స్టాన్కివిజ్ (పోలాండ్; 230.4 పాయింట్లు) కాంస్యం గెలిచారు. -
నిశ్చల్‌కు రజతం
రియో డి జనీరో (బ్రెజిల్): ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో నిశ్చల్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 458 పాయింట్ల స్కోరుతో ఆమె రెండో స్థానంలో నిలిచింది. సీనియర్ స్థాయిలో ఈ టీనేజర్‌కు ఇదే తొలి ప్రపంచకప్. నార్వేకు చెందిన జీనెట్ హెడ్ డస్టడ్కు స్వర్ణం లభించింది. ఈ ప్రపంచకప్‌ను భారత్ 2 పతకాలతో ముగించింది. గత వారం మహిళల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌లో ఎలవెని వలరివన్ స్వర్ణం గెలుచుకుంది. -
ISSF Junior World Cup 2023 : గురి తప్పలేదు!
చిన్నప్పుడు విల్లు ఎక్కుపెట్టింది... లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడు పిస్టల్ గురిపెట్టింది... వరుసగా పతకాలు సాధిస్తోంది. ఆ మధ్యలో రైఫిల్‌తో కూడా సాధన చేసింది... మేఘన సాదుల. ‘నాన్న దగ్గర వెపన్ చూస్తూ పెరిగాను మరి’... అంటూ... షూటింగ్ ప్రాక్టీస్... సాధించిన పతకాల గురించి చెప్పింది. హైదరాబాద్‌లో బీటెక్ చేస్తున్న మేఘన సాదుల... అంతర్జాతీయ క్రీడాకారిణి. లక్ష్యానికి గురి పెట్టిందంటే పతకం తోనే వెనుదిరుగుతుంది. గడచిన జూన్‌లో సూల్ (జర్మనీ)లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీల్లో 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించింది. అంతకంటే ముందు ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా యూనివర్సిటీ షూటింగ్ చాంపియన్‌షిప్, భోపాల్‌లో జరిగిన నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్ కాంపిటీషన్స్‌లోనూ పతకాలు సాధించింది, ఖేలో ఇండియా స్కీమ్‌కి కూడా ఎంపికైంది. ఈ నెలలో సౌత్‌కొరియాలో జరిగే పోటీల్లో పాల్గొననుంది. షూటింగ్లో బుల్లెట్లా దూసుకుపోతున్న మేఘన షూటింగ్ విషయాలతోపాటు తన ఇష్టాలు, అభిరుచులను సాక్షితో పంచుకుంది. నాన్నే నాకు ఆదర్శం మా నాన్న సారంగపాణి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతస్థాయి అధికారి. నాన్నే నా రోల్‌మోడల్. నాకు నాన్న వెపన్ మీద క్రేజ్ ఉండేది. కానీ యూనిఫామ్ సర్వీస్‌లోకి రావాలనే ఆసక్తి పెద్దగా కలగలేదు. బుల్లెట్ ఎలా లోడ్ చేస్తారు, ఎలా ఎయిమ్ చేస్తారనే ఆసక్తి పిల్లలకు సహజంగానే ఉంటుంది. అయితే నాకు సిక్స్త్ క్లాస్‌లో ఆర్చరీ (విలువిద్య) ప్రాక్టీస్ చేసే అవకాశం వచ్చింది. ఖమ్మం ఆర్చరీ అసోసియేషన్‌లో పుట్టా శంకరయ్య నా మెంటార్. టెన్త్‌క్లాస్ వరకు కంటిన్యూ చేశాను. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ట్వెల్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్న షూటింగ్ రేంజ్లో రైఫిల్ ప్రాక్టీస్ చేశాను. కానీ అదంత సీరియస్ ప్రాక్టీస్ కాదు. రోజూ పది నిమిషాలకంటే అవకాశం ఉండేది కాదు. సీరియస్‌గా ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టింది మాత్రం కరోనా టైమ్‌లోనే. కలా... నిజమా! కరోనా టైమ్‌లో క్లాసులు ఆన్లైన్లో జరిగేవి. ఖాళీ సమయం ఎక్కువగా ఉండేది. అప్పుడు మా కోచ్ ప్రసన్న కుమార్ సూచనతో 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. నేను పూర్తిస్థాయిలో పిస్టల్ షూటింగ్ ప్రారంభించిన నాటికి మూడు వారాల్లో రాష్ట్రస్థాయి పోటీలున్నాయి. ఆ పోటీల్లో పాల్గొనడం, గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం అంతా కలలా జరిగిపోయింది. అదే ఏడాది రాష్ట్ర స్థాయి పోటీల్లో నాలుగు పతకాలు రావడంతో నా మీద నాకు నమ్మకం కలిగింది, ఆత్మవిశ్వాసం పెరిగింది. జాతీయస్థాయిలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించాను. ఉస్మానియా తరఫున ఆల్ ఇండియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాను. మనదేశం తరఫున ఆడటం గర్వంగా ఉంది. సాంత్వన అమ్మ ఫోన్‌తోనే! ఖేలో ఇండియా క్యాంప్‌లో మాకు సౌకర్యాలు చాలా బాగుంటాయి. నిపుణులు సూచించిన ఆహారం, ప్రాక్టీస్‌కు అనువైన వాతావరణం ఉంటుంది. నేను ఏమాత్రం షూటింగ్లో సరిగ్గా రాణించనట్లు అనిపించినా, మొదట చేసే పని అమ్మకు ఫోన్ చేయడమే. అమ్మ ఇచ్చే కౌన్సెలింగ్ నన్ను తిరిగి నా లక్ష్యం మీద దృష్టి పెట్టేలా ప్రోత్సహిస్తుంది. నా ప్రతి మూమెంట్లో మా అమ్మానాన్న, అన్నయ్య ఉంటారు. అన్నయ్య స్పెయిన్‌లో చదువుకుంటున్నాడు. పోటీల్లో పాల్గొనడం ఒకవైపు... ఇంజినీరింగ్‌లో క్లాసులు మరోవైపు... ఈ రెండింటినీ బాలెన్స్ చేయడం కష్టమవుతోంది. అందుకే బీటెక్‌లో ఓ ఏడాది విరామం తీసుకుని ప్రాక్టీస్ మీదనే దృష్టి పెట్టాను. షూటింగ్ లో అత్యున్నత స్థాయికి చేరాలనేది నా ఆకాంక్ష. ఆ తర్వాత బీటెక్ మైనింగ్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి, సివిల్ లేదా మైనింగ్ ఫీల్డ్‌లో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనేది నా ఆశయం. ఇప్పటికైతే ఇదే, ఆ తర్వాత అభిప్రాయం మారవచ్చేమో’’ అని నవ్వేసింది మేఘన. సంగీతంతో స్నేహం ఇంట్లోనే షూటింగ్ రేంజ్ ఉంది. రోజూ ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రాక్టీస్ చేస్తాను. మధ్యాహ్న భోజనం తర్వాత రెండు–మూడు గంటల విరామం. సాయంత్రం ఫిట్నెస్ ప్రాక్టీస్ ఉంటుంది. ఏకాగ్రత సాధన కోసం మెడిటేషన్ చేస్తాను. ఉదయం షూటింగ్ తగ్గినప్పుడు సాయంత్రం ఓ గంట– రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్‌లో బాగా రాణించినప్పటికీ ఒక్కోసారి పోటీల్లో రాణించలేకపోవచ్చు. నాకూ కొన్ని అనుభవాలున్నాయి. అందుకు నాకు నేనుగా ఆలోచించుకుని ఒక రొటీన్‌ని డిజైన్ చేసుకున్నాను. ఇంట్లో ఎలాగైతే షూటింగ్ తర్వాత మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవుతానో, కాంపిటీషన్లకు వెళ్లినప్పుడు కూడా అదే రొటీన్‌ని కొనసాగించాలనుకున్నాను. ఈ గేమ్‌లో లక్ష్యాన్ని ఛేదించడానికి మెదడును చాలా కండిషన్ చేసుకుంటాం. మైండ్ అదే కండిషన్లో కొనసాగకూడదు, తప్పనిసరిగా రిలాక్స్ కావాలి. అలా నాకు మ్యూజిక్ ఒత్తిడిని తగ్గించే బెస్ట్ ఫ్రెండ్. సినిమాలు బాగా చూస్తాను. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి -
ISSF Shooting World Cup 2022: షూటర్ల జోరు.. భారత ఖాతాలో 14వ పతకం
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ఈ ఏడాది అంతర్జాతీయ షూటింగ్ సీజన్‌లోని మూడో ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. మంగళవారం భారత్ ఖాతాలో 14వ పతకం చేరింది. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ విభాగంలో అనీశ్ భన్వాలా–రిథమ్ సాంగ్వాన్ ద్వయం భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. కాంస్య పతక పోరులో అనీశ్–రిథమ్ జోడీ 16–12 పాయింట్లతో అనా దెడోవా–మార్టిన్ పొదరాస్కీ (చెక్ రిపబ్లిక్) జంటపై విజయం సాధించింది. ఆరు జోడీలు పాల్గొన్న క్వాలిఫికేషన్ స్టేజ్–2లో అనీశ్–రిథమ్ 380 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతక పోరుకు అర్హత పొందారు. అనీశ్–రిథమ్ జంటకిది రెండో ప్రపంచకప్ పతకం. ఈ ఏడాది మార్చిలో కైరోలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో అనీశ్–రిథమ్ జోడీ స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మిక్స్డ్ ఈవెంట్లో బరిలోకి దిగిన రెండు భారత జోడీలు త్రుటిలో పతక మ్యాచ్‌లకు దూరమయ్యాయి. సంజీవ్ రాజ్‌పుత్–అంజుమ్ మౌద్గిల్ జంట ఐదో స్థానంలో, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్–ఆశీ చౌక్సీ జోడీ ఆరో స్థానంలో నిలిచాయి. తాజా ప్రపంచకప్ టోర్నీలో భారత్ ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించి మొత్తం 14 పతకాలతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. చదవండి: Commonwealth Games 2022: కామన్ వెల్త్ గేమ్స్.. భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని -
షూటింగ్ వరల్డ్‌కప్: సత్తా చాటిన భారత షూటర్లు
ఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్‌కప్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో అన్ని పతకాలు భారతీయ మహిళా షూటర్లు కైవసం చేసుకోవడం విశేషం. బుధవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్ విభాగంలో చింకీ యాదవ్‌కు స్వర్ణం, రాహీ సావంత్‌కు రజతం, మను బాకర్‌కు కాంస్యం దక్కించుకున్నారు. -
షూటింగ్ ప్రపంచకప్‌లో కరోనా కలకలం..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నీలో కరోనా కలకలం రేపింది. ముగ్గురు షూటర్లకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మిగతా షూటర్లంతా హోటల్ గదుల్లో ఐసోలేషన్‌లో ఉన్నట్టు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) వర్గాలు శనివారం వెల్లడించాయి. వైరస్ బారినపడ్డ షూటర్లతో సన్నిహితంగా ఉన్న మరో ముగ్గురు క్రీడాకారులు సైతం పరీక్షలు చేయించుకున్నట్టు అధికారులు తెలిపారు. వారి ఫలితాలు రావాల్సి ఉండగా.. ముందస్తుగా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు టోర్నీ నిర్వహకులు పేర్కొన్నారు. కోవిడ్ బారిన పడ్డ ముగ్గురు షూటర్లలో ఇద్దరు భారతీయ క్రీడాకారులేనని సంబంధిత వర్గాల సమాచారం. ఈ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారుల్లో ఇప్పటికే నలుగురు వైరస్ బారినపడగా.. గురువారం మరో విదేశీ ఆటగాడికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా, ఈ ప్రపంచకప్‌లో భారత షూటర్లు దివ్యాంశ్ సింగ్ పన్వర్, అర్జున్ బబుతా సత్తాచాటారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఈ ఇద్దరూ ఫైనల్లో చోటు సంపాదించారు. శుక్రవారం జరిగిన 60 షాట్ల క్వాలిఫికేషన్ రౌండ్లో అర్జున్ (631.8 పాయింట్లు) మూడో స్థానం, పన్వర్ (629.1 పాయింట్లు) ఆరో స్థానంలో నిలిచి తుది పోరుకు అర్హత సాధించారు. వీరిలో పన్వర్ టోక్యో ఒలింపిక్స్ బెర్తును కూడా సాధించాడు. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అంజుం మౌద్గిల్ ఫైనల్ చేరింది. అర్హత పోటీలో అంజుమ్ 629.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. -
జీతూ రాయ్‌కు రజతం
షూటింగ్ వరల్డ్ కప్ బాకు (అజర్బైజాన్): రియో ఒలింపిక్స్ ముందు భారత ‘పిస్టల్ కింగ్’ జీతూ రాయ్ రజతంతో మెరిశాడు. శనివారం ఇక్కడ జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జీతూ రాయ్ 199.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 200 పాయింట్లతో ఫిలిప్ అల్మిడా (బ్రెజిల్) స్వర్ణాన్ని సాధించగా, మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ అయిన జంగో జిన్ (కొరియా) 178.8 పాయింట్లతో కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఓవరాల్‌గా రాయ్‌కి ఇది ఆరో ప్రపంచ కప్ పతకం కాగా... ఈ సీజన్లో రెండోది. మరోవైపు 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్ హీనా సిద్ధూ (582 పాయింట్లు) ఫైనల్స్‌కు అర్హత సాధించింది. -
రియో ఒలింపిక్స్‌కు బింద్రా అర్హత
న్యూఢిల్లీ : ఒలింపిక్స్‌లో భారత్ తరఫున వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణం సాధించిన ఏకైక షూటర్ అభినవ్ బింద్రా వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో బింద్రా ఆరో స్థానంలో నిలవడం ద్వారా రియో బెర్త్ దక్కించుకున్నాడు. భారత్ నుంచి ఇప్పటికే షూటింగ్లో గగన్ నారంగ్, జీతూ రాయ్, అపూర్వి చండిలా రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. బింద్రా ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఈసారితో ఐదోసారి అవుతుంది.