
రియో డి జనీరో (బ్రెజిల్): ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో నిశ్చల్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 458 పాయింట్ల స్కోరుతో ఆమె రెండో స్థానంలో నిలిచింది. సీనియర్ స్థాయిలో ఈ టీనేజర్‌కు ఇదే తొలి ప్రపంచకప్. నార్వేకు చెందిన జీనెట్ హెడ్ డస్టడ్‌కు స్వర్ణం లభించింది. ఈ ప్రపంచకప్‌ను భారత్ 2 పతకాలతో ముగించింది. గత వారం మహిళల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌లో ఎలవెని వలరివన్ స్వర్ణం గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment