Mehuli Ghosh
-
మెహులీ–రుద్రాంక్ష్ జోడీకి స్వర్ణం
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నీలో మంగళవారం భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ విభాగంలో మెహులీ ఘోష్–రుద్రాంక్ష్ పాటిల్ జోడీ బంగారు పతకం... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో రిథమ్ సాంగ్వాన్–అర్జున్ జంట రజత పతకం గెలిచింది. ఫైనల్స్‌లో మెహులీ–రుద్రాంక్ష్ 16–10తో షెన్ యుఫాన్–జు మింగ్షుయ్ (చైనా)లపై నెగ్గగా... రిథమ్–అర్జున్ 11–17తో ట్రిన్–క్వాంగ్ (వియత్నాం)ల చేతిలో ఓడింది. -
స్వర్ణంతో పారిస్ ఒలింపిక్స్‌కు మేహులి
భారత యువ షూటర్ మేహులి ఘోష్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో మెరిసింది. అజర్‌బైజాన్‌లోని బాకూలో జరుగుతున్న ఈ టోర్నీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ఆమె స్వర్ణం సాధించింది. 1895.9 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచిన మేహులి తాజా ప్రదర్శనతో వచ్చే ఏడాది పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. మరో వైపు మేహులి, రమిత, తిలోత్తమ సేన్లతో కూడిన భారత జట్టు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. అయితే ఈ టోర్నీ ద్వారా ఒలింపిక్ కోటా వ్యక్తిగత ఈవెంట్లకు మాత్రమే పరిమితం. మరో వైపు స్కీట్ టీమ్ 14వ స్థానంలో నిలవగా, ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో టాప్–25లో భారత్‌నుంచి ఒక్క షూటర్ కూడా నిలవలేకపోయాడు. -
భారత్ గురి కుదిరింది.. ప్రపంచకప్ షూటింగ్లో రెండో పతకం ఖాయం
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్‌లో భారత్ గురి కుదిరింది. మరో పతకం ఖాయమైంది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ మెహులి ఘోష్– షాహు తుషార్ మనే జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫైనల్లో ఓడినా... కనీసం రజతమైనా దక్కుతుంది. 60 షాట్ల క్వాలిఫయర్స్‌లో భారత జోడీ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 30 జంటలు ఇందులో గురిపెట్టగా... మెహులి–తుషార్ ద్వయం 634.4 స్కోరుతో టాప్‌లేపింది. బుధవారం జరిగే ఫైనల్లో భారత్, హంగేరి జోడీలు పసిడి పతకం కోసం పోటీపడతాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో శివ నర్వాల్–పాలక్ ద్వయం కాంస్య పతక పోరుకు అర్హత పొందింది. -
షూటింగ్: భారత మహిళల గురి అదుర్స్!
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. వరుసగా ఐదోరోజు భారత ఆటగాళ్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత మహిళా షూటర్లు రజతం, కాంస్య పతకాలు సాధించారు. మెహులి ఘోష్ రజతం నెగ్గగా, అదే విభాగంలో అపూర్వి చండేలా కాంస్యం కైవసం చేసుకున్నారు. టాప్ పొజిషన్లో నిలిచిన సింగపూర్‌కు చెందిన లిండ్సే వెలోసో స్వర్ణం అందుకున్నారు. ఇప్పటివరకూ 8 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్య పతకాలు కొల్లగొట్టిన భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నేటి ఉదయం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు చెందిన జీతూరాయ్ స్వర్ణం గెలుచుకోగా, ఓమ్ ప్రకాశ్ మితర్వాల్ కాంస్యంతో సాధించిన విషయం తెలిసిందే.