భారత యువ షూటర్ మేహులి ఘోష్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో మెరిసింది. అజర్‌బైజాన్‌లోని బాకూలో జరుగుతున్న ఈ టోర్నీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ఆమె స్వర్ణం సాధించింది. 1895.9 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచిన మేహులి తాజా ప్రదర్శనతో వచ్చే ఏడాది పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.
మరో వైపు మేహులి, రమిత, తిలోత్తమ సేన్‌లతో కూడిన భారత జట్టు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది. అయితే ఈ టోర్నీ ద్వారా ఒలింపిక్ కోటా వ్యక్తిగత ఈవెంట్లకు మాత్రమే పరిమితం. మరో వైపు స్కీట్ టీమ్ 14వ స్థానంలో నిలవగా, ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో టాప్–25లో భారత్‌నుంచి ఒక్క షూటర్ కూడా నిలవలేకపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment