![Rudrankksh And Mehuli Win Fifth Gold In Asian Olympic Qualifiers - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/10/Untitled-4.jpg.webp?itok=K209fDcb)
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నీలో మంగళవారం భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ విభాగంలో మెహులీ ఘోష్–రుద్రాంక్ష్ పాటిల్ జోడీ బంగారు పతకం... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ విభాగంలో రిథమ్ సాంగ్వాన్–అర్జున్ జంట రజత పతకం గెలిచింది.
ఫైనల్స్‌లో మెహులీ–రుద్రాంక్ష్ 16–10తో షెన్ యుఫాన్–జు మింగ్‌షుయ్ (చైనా)లపై నెగ్గగా... రిథమ్–అర్జున్ 11–17తో ట్రిన్–క్వాంగ్ (వియత్నాం)ల చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment