పసిడి పోరుకు మేరీకోమ్‌ | Mary Kom Enters Women's 48kg Final, Assures A Silver | Sakshi
Sakshi News home page

పసిడి పోరుకు మేరీకోమ్‌

Apr 11 2018 7:19 PM | Updated on Apr 11 2018 7:22 PM

Mary Kom Enters Women's 48kg Final, Assures A Silver - Sakshi

గోల్డ్‌కోస్ట్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌ పంచ్‌ అదిరింది. బుధవారం జరిగిన సెమీ ఫైనల్లో మేరీకోమ్‌ 5-0 తేడాతో  శ్రీలంక బాక్సర్ అనూష దిల్రుక్షిపై గెలిచి ఫైనల్‌ పోరుకు అర్హత సాధించింది. ఫలితంగా మేరీకోమ్‌ రజత పతకం ఖాయం చేసుకుంది.

తొలిసారి కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆడుతున్న మేరీకోమ్‌ మహిళల 48 కేజీల కేటగిరీలో భాగంగా మొత్తం ఐదు రౌండ్లు పాటు జరిగిన సెమీస్‌లో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మేరీకోమ్‌ 30-27, 30-27, 30-27, 30-27, 30-27 తేడాతో అనూష దిల్రుక్షిపై గెలుపొంది ఫైనల్లోకి ప‍్రవేశించింది. శనివారం జరిగే పసిడి పోరులో ఉత్తర ఐర్లాండ్‌ క్రిస్టినా ఓ హరాతో మేరీకోమ్‌ తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement