గోల్డ్‌కోస్ట్ (ఆ్రస్టేలియా): బ్రిటిష్ రాజ్యమేలిన దేశాల మధ్య ప్రతి నాలుగేళ్లకోసారి అంగరంగ వైభవంగా జరిగే కామన్వెల్త్ క్రీడలు ఆతిథ్య నగరాలకు గుదిబండగా మారాయి. ఆ్రస్టేలియాలాంటి అభివృద్ధి చెందిన దేశాలే నిర్వహణ పెనుభారంగా భావిస్తున్నాయి. మాకొద్దంటే మాకొద్దని ఘనమైన ఆతిథ్యానికి దూరం జరుగుతున్నాయి.
తాజాగా 2026 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించలేమని ఆ్రస్టేలియాకు చెందిన మరో నగరం గోల్డ్‌కోస్ట్ కూడా వైదొలిగింది. రెండేళ్లలో జరిగే ఈ క్రీడల హక్కుల్ని తొలుత ఆ్రస్టేలియాలోని విక్టోరియా రాష్ట్రం దక్కించుకుంది. అయితే క్రీడాగ్రామం నిర్మాణం, మౌలిక వసతుల ఏర్పాటు, రవాణా, ఇతరత్రా ఆధునిక సదుపాయాల కల్పన తదితర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని నిర్ధారించుకున్నాక విక్టోరియా ఆతిథ్యం నుంచి తప్పుకుంటున్నట్లు ఈ జూలైలోనే వెల్లడించింది.
దీంతో 2018లో ఈ క్రీడల్ని విజయవంతంగా నిర్వహించిన గోల్డ్‌కోస్ట్ మరోసారి ఆతిథ్యమిచ్చేందుకు ముందుకొచి్చంది. అయితే 700 కోట్ల డాలర్లకు పైగా వ్యయమయ్యే ఈ క్రీడల ఆతిథ్యాన్ని మరోసారి భరించడం కష్టమని వివరిస్తూ గోల్డ్‌కోస్ట్ కూడా ఈ క్రీడల నిర్వహణ బాధ్యతల నుంచి వైదొలిగింది. ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిందిగా కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్)కు గోల్డ్‌కోస్ట్ నగర మేయర్ టామ్ టేట్ సూచించారు. ఆస్ట్రేలియా కాకుండా మరో మూడు దేశాలు కామన్వెల్త్ క్రీడల కోసం ఆసక్తి చూపిస్తున్నాయని చెబుతున్నప్పటికీ అనుకున్నట్లుగా 2026లో కామన్వెల్త్ గేమ్స్ జరిగే అవకాశాలు లేవు. ఒకవేళ జరిగితే మాత్రం మరుసటి ఏడాది (2027) జరగొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment