బికినీ భామలతో ఐదుకోట్ల పార్టీ | Tobacco millionaire Travers Beynon's lavish $500,000 party almost turns to disaster after a rogue firework starts a fire | Sakshi
Sakshi News home page

బికినీ భామలతో ఐదుకోట్ల పార్టీ

Published Sat, Dec 5 2015 8:30 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

బికినీ భామలతో ఐదుకోట్ల పార్టీ

బికినీ భామలతో ఐదుకోట్ల పార్టీ

సిడ్నీ: కుప్పలుతెప్పలుగా డబ్బు వచ్చిపడుతుంటే విలాసవంతులు తమ కులాసా జీవితాల్లో ఆడంబరంగా, అంగరంగ వైభవంగా విందు వినోదాల్లో మునిగితేలుతారని తెలుసు. ఆస్ట్రేలియాకు చెందిన టుబాకో దిగ్గజం ట్రావెర్స్ బెనాన్ స్టైలే డిఫరెంట్. వివిధ రకాల థీమ్లతో విచిత్ర రీతుల్లో పార్టీలు ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. తనకు తాను ‘క్యాండీమేన్(అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారి. ఈ పేరుతో హాలివుడ్లో ఓ సినిమా కూడా వచ్చింది)’గా పిలుచుకునే ట్రావర్స్ అడపాదడపా విలాసవంతంగా పార్టీలు ఇవ్వడం, వాటిని ఎప్పటికప్పుడు వాటిని సోషల్ వెబ్సైట్ ‘ఇన్స్టాగ్రామ్’లో పోస్ట్ చేయడం ఆయనకు అలవాటు. ఇన్స్టాగ్రామ్లో ఆయనకు దాదాపు మూడు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఈసారి ‘అన్లీష్ యువర్ ఇన్నర్ బీస్ట్’ అన్న థీమ్తో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజాము వరకు ఈ పార్టీ కొనసాగుతుంది. విచిత్ర వేషధారణలతో అతిథులు హాజరయ్యారు. ఎక్కువ మంది జంతు చర్మలతో కూడిన దుస్తులతో వచ్చారు. ఆయన ఇచ్చే ఏ పార్టీలోనైనా కామన్గా కనిపించేది ఒక్కటే. అదే బికినీ భామల ప్రత్యేక ఆకర్షణ. ఈసారి కూడా వారు ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చి స్మిమ్మింగ్ పూల్స్లోకి దిగి జలకాలాడారు. వయ్యారాలు వొలకబోసారు. మరికొందరు నడుం వరకు మత్స్యకన్నెలుగా దుస్తులు ధరించి ఆహూతులను అలరించారు. ఇప్పటికే ఈ పార్టీకి ఐదు కోట్ల రూపాయలు ఖర్చయిందని ఈవెంట్ మేనేజర్లు తెలియజేశారు. సరిగ్గా 12 గంటలకు 'బ్యాట్మేన్'  రూపంలో ట్రావర్స్ గాలిలో తేలుతూ వచ్చారు. దీని కోసం స్టంట్ మాస్టర్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

పాశ్చాత్య సంగీత హోరులో అతిథులంతా మద్యం సేవిస్తూ తూలిపోతుండగా, అందమైన భామలు తమ మత్స్యకంటి చూపులతో పార్టీని మరింత కెపైక్కించారు. ఏనుగు, మొసలి, కొండముచ్చులను కూడా అతిథులను ఆకట్టుకునేందుకు ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్లోని తన విలాసవంతమైన భవనంలో  ఏర్పాటు చేసిన ఈ పార్టీలో ట్రావర్స్ ప్రతి ఈవెంట్ వద్దకు వెళ్లి కెమేరాలను ఫోజులిచ్చారు. ఆ ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ వచ్చారు. ఓ ఫొటోలో తన భార్య టయేషా, మరికొంత మంది ప్రియురాళ్ల మెడలకు పగ్గాల్లాగా తాళ్లు వేసి జంతువుల్లా వారిని లాగుతున్న దృశ్యాన్ని సోషల్ మీడియా తీవ్రంగా విమర్శించింది. అయితే తన పార్టీ థీమ్లోనే జంతువు ఉందంటూ ఆయన సమర్ధించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement