త్రివర్ణపతాకంతో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ దేశాల మధ్య క్రీడల పండగకు తెర లేచింది. ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లోని కరారే స్టేడియంలో 21వ కామన్వెల్త్ క్రీడలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భారత త్రివర్ణపతాకం చేత పట్టుకుని ఆరంభ కార్యక్రమంలో భారత బృందానికి నాయకత్వం వహించారు.
జాతీయ పతాకంతో సింధు ముందు నడవగా క్రీడాకారులందరూ ఆమెను అనుసరించారు. తొలిసారి భారత మహిళా క్రీడాకారిణీలు చీరల్లో కాకుండా కోటు, ట్రౌజర్‌లతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక రేపటి (గురువారం) నుంచి ప్రారంభమయ్యే పోటీల్లో భారత్ తరఫున మొత్తం 218 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. మొత్తం 17 క్రీడాంశాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక గత కామన్వెల్త్ గేమ్స్‌లో 15 స్వర్ణం, 30 రజతం, 19 కాంస్య పతకాలతో భారత్ మొత్తం 64 పతకాలు గెలుచుకోంది. ఈసారి వీటి సంఖ్య పెంచాలని భారత క్రీడాకారులు ఉవ్విళ్లురుతున్నారు.
పోటీల ప్రారంభానికి ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రెజ్లింగ్‌లో 50 కేజీల విభాగంలో పాల్గొంటున్న విన్నేశ్ పొగట్ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డారు. వెంటనే ఫిజియో ధీరేంద్ర ప్రతాప్‌సింగ్ శాయ్ అధికారుల సాయంతో చికిత్స నిమిత్తం ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్ స్కాన్ నిర్వహించిన వైద్యులు ఎలాంటి భయం అక్కర్లేదని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment