
క్వీన్స్‌లాండ్: వచ్చే నెలలో వందో వసంతంలోకి అడుగుపెడుతున్న ఆస్ట్రేలియాకు చెందిన స్విమ్మర్ జార్జ్ కారోన్స్(99) వరల్డ్ రికార్డు స్పష్టించాడు. 50 మీటర్ల ఫ్రీ స్టెయిల్ ఈవెంట్‌ను కారోన్స్ 56.12 సెకండ్లలో పూర్తి చేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
తన వయసు గ్రూప్‌కు చెందిన వారితో జరిగిన పోరులో కారోన్స్ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్ స్విమ్మింగ్ ట్రయల్‌లో భాగంగా ఇక్కడ గోల్డ్ కాస్ట్‌లో జరిగిన పోటీల్లో కారోన్స్ అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు బ్రిటీష్ స్మిమ్మర్ జాన్ హారిసన్ పేరిట ఉండేది. 2014లో 50 మీటర్ల ఫ్రీ స్టెయిల్‌ను హారిసన్ 1.31. 19 సెకండ్లలో పూర్తి చేయగా, తాజాగా దాన్ని కారోన్స్ సవరించాడు. ఏప్రిల్ నెలలో కారోన్స్ వంద ఏట అడుగుపెట్టబోతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment