
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులు బుధవారం ఆతిథ్య నగరం గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా)కు చేరుకున్నారు. ‘అథ్లెటిక్స్, బాక్సింగ్, హాకీ, లాన్ బాల్స్, షూటింగ్ క్రీడాంశాలకు చెందిన ఆటగాళ్లు క్రీడా గ్రామంలోకి అడుగు పెట్టారు’ అని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తెలిపింది. భారత బృందానికి చెఫ్ డి మిషన్‌గా ఉన్న విక్రమ్ సింగ్ సిసోడియా, మేనేజర్లు నామ్‌దేవ్, అజయ్ నారంగ్, షియాద్ క్రీడా గ్రామంలో ఐఓఏ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 4 నుంచి 15 వరకు కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి.