జాగ్రెబ్ (క్రొయేషియా): యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాగ్రెబ్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్‌లో పురుషుల గ్రీకో రోమన్ 67 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అశు కాంస్య పతకాన్ని సాధించాడు. కాంస్య పతక పోరులో 23 ఏళ్ల అశు 5–0తో అడోమస్ గ్రిగాలియునస్ (లిథువేనియా)పై నెగ్గాడు. అశుకు 500 స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 44 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్‌లో అశు 0–9తో రెజా అబ్బాసి (ఇరాన్) చేతిలో ఓడిపోయాడు. అయితే రెజా ఫైనల్ చేరుకోవడంతో... రెజా చేతిలో ఓడిపోయిన వారి మధ్య ‘రెపిచాజ్’ పద్ధతిలో అశుకు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం లభించింది. ‘రెపిచాజ్’ తొలి బౌట్‌లో అశు 8–0తో పోహిలెక్ (హంగేరి)పై... రెండో బౌట్‌లో 9–0తో హావర్డ్ (నార్వే)పై గెలుపొంది కాంస్య పతక బౌట్‌కు అర్హత సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment