United World Wrestling rankings
-
భారత రెజ్లింగ్ సమాఖ్యకు (WFI) షాక్.. సభ్యత్వం రద్దు
విశ్వవేదికపై భారత్‌కు అవమానం జరిగింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య(UWW).. భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) సభ్యత్వాన్ని రద్దు చేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్ఐ విఫలమైనందుకు చర్యలు తీసుకున్నట్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య ప్రకటించింది. యూడబ్ల్యూడబ్ల్యూ తీసుకున్న ఈ నిర్ణయంతో త్వరలో (సెప్టెంబర్ 16 నుంచి) ప్రారంభంకానున్న ఒలింపిక్ క్వాలిఫైయింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ పోటీల్లో భారత అథ్లెట్లుగా తటస్థ అథ్లెట్లుగా (భారత్ ట్యాగ్‌లైన్ లేకుండా) బరిలోకి దిగాల్సి ఉంటుంది. కాగా, డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై స్టార్ మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తప్పించాలని రెజ్లర్లు తారాస్థాయిలో ఆందోళనలకు దిగడంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత డబ్ల్యూఎఫ్ఐ నిర్వహణ బాధ్యతను అడ్‌హక్ కమిటీకి అప్పగించింది. అయితే అడ్‌హక్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు వరుసగా అవాంతరాలు ఎదురవుతూ వచ్చాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది (2023) మే 7న ఎలక్షన్స్ జరగాల్సి ఉండింది. అయితే అప్పుడు క్రీడా మంత్రిత్వ శాఖ ఎన్నికలను నిలిపి వేసింది. ఆతర్వాత చాలా తేదీలు మారుతూ వచ్చాయి. ఈ మధ్యలో ఓటు హక్కు కోసం పలు సంఘాలు కోర్టుకెక్కాయి. చివరగా ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహిస్తామని అడ్‌హక్ కమిటీ ప్రకటించగా.. పంజాబ్-హర్యానా హైకోర్టు ఈ ఎన్నికలపై స్టే విధించింది. దీంతో ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య.. భారత రెజ్లింగ్ సమాఖ్యపై వేటు వేసింది. -
Zagreb Open 2023 wrestling: అశు ‘కంచు పట్టు’
జాగ్రెబ్ (క్రొయేషియా): యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాగ్రెబ్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లో పురుషుల గ్రీకో రోమన్ 67 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అశు కాంస్య పతకాన్ని సాధించాడు. కాంస్య పతక పోరులో 23 ఏళ్ల అశు 5–0తో అడోమస్ గ్రిగాలియునస్ (లిథువేనియా)పై నెగ్గాడు. అశుకు 500 స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 44 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో అశు 0–9తో రెజా అబ్బాసి (ఇరాన్) చేతిలో ఓడిపోయాడు. అయితే రెజా ఫైనల్ చేరుకోవడంతో... రెజా చేతిలో ఓడిపోయిన వారి మధ్య ‘రెపిచాజ్’ పద్ధతిలో అశుకు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం లభించింది. ‘రెపిచాజ్’ తొలి బౌట్లో అశు 8–0తో పోహిలెక్ (హంగేరి)పై... రెండో బౌట్లో 9–0తో హావర్డ్ (నార్వే)పై గెలుపొంది కాంస్య పతక బౌట్‌కు అర్హత సాధించాడు. -
భారత రెజ్లర్ సరిత స్వర్ణ సంబరం...
భారత మహిళా స్టార్ రెజ్లర్ సరితా మోర్ ఈ ఏడాది తన ఖాతాలో తొలి స్వర్ణ పతకాన్ని జమ చేసుకుంది. కజకిస్తాన్‌లో జరుగుతున్న యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ టోర్నీ బొలాత్ టర్లీఖనోవ్ కప్‌లో సరితా 59 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. సరిత గెలిచిన మూడు బౌట్లూ టెక్నికల్ సుపీరియారిటీ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం రాగానే విజేతగా ప్రకటిస్తారు) పద్ధతిలోనే రావడం విశేషం. ఫైనల్లో సరిత 10–0తో జాలా అలియెవ్ (అజర్బైజాన్)పై, సెమీఫైనల్లో 12–2తో ఐజాన్ ఇస్మగులోవా (కజకిస్తాన్)పై, రెండో రౌండ్లో 11–0తో డయానా (కజకిస్తాన్)పై గెలిచింది. ఇదే టోర్నీలో భారత రెజ్లర్లు మనీషా (65 కేజీలు) స్వర్ణం... బిపాసా (72 కేజీలు) రజతం, సుష్మా (55 కేజీలు) కాంస్యం సాధించారు. -
‘రజత’ సరిత
రోమ్: యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లో భారత రెజ్లర్లు తమ సత్తా చాటుకున్నారు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో సరిత మోర్ (57 కేజీలు) రజతం పతకం దక్కించుకోగా... పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో అర్జున్ (55 కేజీలు), నీరజ్ (63 కేజీలు), నవీన్ (130 కేజీలు), కుల్దీప్ మలిక్ (72 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. గిలియా రోడ్రిగ్స్ (బ్రెజిల్)తో జరిగిన ఫైనల్లో సరిత 2–4 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. చివరి నిమిషం వరకు 2–0తో ఆధిక్యంలో నిలిచిన సరిత ఆ తర్వాత నాలుగు పాయింట్లు సమర్పించుకొని రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల గ్రీకో రోమన్ కాంస్య పతక బౌట్లలో అర్జున్ 8–0తో రికార్డో (పోర్చుగల్)పై, నీరజ్ 6–4తో శామ్యూల్ జోన్స్ (అమెరికా)పై, నవీన్ 3–1తో స్టీఫెన్ డేవిడ్ (చెక్ రిపబ్లిక్)పై, కుల్దీప్ 10–9 తో లబజనోవ్ (రష్యా)పై గెలుపొందారు. -
రెండో ర్యాంక్‌లో రెజ్లర్ బజరంగ్
న్యూఢిల్లీ: యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా రెండో ర్యాంక్‌లో నిలిచాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో బజరంగ్ 59 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 60 పాయింట్లతో ఒలింపిక్ చాంపియన్ రషిదోవ్ (రష్యా) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. దౌలత్ నియాజ్బెకోవ్ (కజకిస్తాన్–56 పాయింట్లు), ఇస్మాయిల్ ముస్జుకజెవ్ (హంగేరి–41 పాయింట్లు) వరుసగా మూడు, నాలుగు ర్యాంక్‌ల్లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్ ప్రకారం ఈ నలుగురికి వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో టాప్–4లో సీడింగ్ లభించడం ఖాయమైంది. పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన రవి దహియా 45 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో ఉన్నాడు. 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా 54 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. -
ప్రపంచ ఉత్తమ జూనియర్ రెజ్లర్ దీపక్
న్యూఢిల్లీ: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రదర్శన చేసిన భారత యువ రెజ్లర్ దీపక్ పూనియాకు తగిన గుర్తింపు లభించింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) వార్షిక పురస్కారాల్లో 18 ఏళ్ల దీపక్ ‘జూనియర్ ఫ్రీస్టయిల్ రెజ్లర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికయ్యాడు. ఈ సంవత్సరం దీపక్ జూనియర్‌తోపాటు సీనియర్ విభాగంలోనూ మెరిశాడు. ఆగస్టులో ఎస్తోనియాలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్íÙప్లో 86 కేజీల విభాగంలో దీపక్ విజేతగా నిలిచి స్వర్ణం సాధించాడు. ఈ క్రమంలో 18 ఏళ్ల తర్వాత జూనియర్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తొలి భారత రెజ్లర్‌గా అతను ఘనత సాధించాడు. అనంతరం సెపె్టంబరులో కజకిస్తాన్ రాజధాని నూర్ సుల్తాన్‌లో జరిగిన ప్రపంచ సీనియర్ చాంపియన్íÙప్లో 86 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచాడు. దాంతోపాటు వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ సొంతం చేసుకున్నాడు. ‘చాలా సంతోషంగా ఉన్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జూనియర్ రెజ్లర్లలో నన్ను మేటి రెజ్లర్‌గా గుర్తించినందుకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డు నాలో మరింత ఉత్సాహన్ని పెంచుతుంది’ అని 2016లో క్యాడెట్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన దీపక్ వ్యాఖ్యానించాడు. -
నంబర్‌వన్ ర్యాంక్‌కు అడుగు దూరంలో...
భారత మహిళా రెజ్లర్ నవ్‌జ్యోత్ కౌర్ నంబర్‌వన్ ర్యాంక్‌కు కేవలం అడుగు దూరంలో నిలిచింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో నవ్‌జ్యోత్ కౌర్ 65 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా ఘనత సాధించిన నవ్‌జ్యోత్ కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ కూడా రెండో స్థానంలో ఉండటం విశేషం. -
సాక్షి ఖాతాలో మరో ఘనత
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత రెజ్లర్ సాక్షి మాలిక్ ర్యాంక్ మెరుగుపడింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్స్‌లో సాక్షి టాప్-5లో ప్రవేశించింది. మహిళల 58 కిలోల కేటగిరిలో సాక్షి నాలుగో ర్యాంక్ సాధించింది. ఆమెకిదే కెరీర్ బెస్ట్ ర్యాంక్ కావడం విశేషం. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ కేటగిరిలో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా సాక్షి ఘనత సాధించిన సంగతి తెలిసిందే. రియో ఈవెంట్లో ఆమె కాంస్యం గెలిచి దేశానికి తొలిపతకం అందించింది. రియో విజయంతో ఆమె ర్యాంక్ మెరుగుపడింది. తాజా ర్యాంకింగ్స్ 48 కిలోల కేటగిరి జాబితాలో మరో భారత రెజ్లర్ వినేష్ పొగట్ రెండు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఇక పురుషుల ఫ్రీస్టయిల్ కేటగిరిలో సందీప్ తోమర్ (15వ ర్యాంక్), బజ్రంగ్ పూనియా (18వ ర్యాంక్) మాత్రమే టాప్-20లో నిలిచారు.