సాక్షి ఖాతాలో మరో ఘనత | Rio bronze medalist Sakshi Malik enters top-5 in world rankings | Sakshi
Sakshi News home page

సాక్షి ఖాతాలో మరో ఘనత

Published Mon, Sep 12 2016 5:58 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

సాక్షి ఖాతాలో మరో ఘనత

సాక్షి ఖాతాలో మరో ఘనత

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత రెజ్లర్ సాక్షి మాలిక్ ర్యాంక్ మెరుగుపడింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్స్లో సాక్షి టాప్-5లో ప్రవేశించింది. మహిళల 58 కిలోల కేటగిరిలో సాక్షి నాలుగో ర్యాంక్ సాధించింది. ఆమెకిదే కెరీర్ బెస్ట్ ర్యాంక్ కావడం విశేషం.

ఒలింపిక్స్లో రెజ్లింగ్ కేటగిరిలో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్గా సాక్షి ఘనత సాధించిన సంగతి తెలిసిందే. రియో ఈవెంట్లో ఆమె కాంస్యం గెలిచి దేశానికి తొలిపతకం అందించింది. రియో విజయంతో ఆమె ర్యాంక్ మెరుగుపడింది. తాజా ర్యాంకింగ్స్ 48 కిలోల కేటగిరి జాబితాలో మరో భారత రెజ్లర్ వినేష్ పొగట్ రెండు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఇక పురుషుల ఫ్రీస్టయిల్ కేటగిరిలో సందీప్ తోమర్ (15వ ర్యాంక్), బజ్రంగ్ పూనియా (18వ ర్యాంక్) మాత్రమే టాప్-20లో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement