భారత మహిళా స్టార్ రెజ్లర్ సరితా మోర్ ఈ ఏడాది తన ఖాతాలో తొలి స్వర్ణ పతకాన్ని జమ చేసుకుంది. కజకిస్తాన్‌లో జరుగుతున్న యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ టోర్నీ బొలాత్ టర్లీఖనోవ్ కప్‌లో సరితా 59 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది.
సరిత గెలిచిన మూడు బౌట్‌లూ టెక్నికల్ సుపీరియారిటీ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం రాగానే విజేతగా ప్రకటిస్తారు) పద్ధతిలోనే రావడం విశేషం. ఫైనల్లో సరిత 10–0తో జాలా అలియెవ్ (అజర్‌బైజాన్)పై, సెమీఫైనల్లో 12–2తో ఐజాన్ ఇస్మగులోవా (కజకిస్తాన్)పై, రెండో రౌండ్‌లో 11–0తో డయానా (కజకిస్తాన్)పై గెలిచింది. ఇదే టోర్నీలో భారత రెజ్లర్లు మనీషా (65 కేజీలు) స్వర్ణం... బిపాసా (72 కేజీలు) రజతం, సుష్మా (55 కేజీలు) కాంస్యం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment