kazakisthan
-
భార్యను అతికిరాతకంగా చంపిన మాజీ మంత్రి
అస్తానా: మధ్య ఆసియా దేశం కజకస్తాన్ నిరసనలతో అట్టుడికిపోతోంది. ఓ మాజీ మంత్రి తన భార్యను అతికిరాతకంగా కొట్టి చంపిన వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ మానవ మృగం కోర్టు విచారణ ఎదుర్కొంటుండగా.. కఠిన శిక్ష పడాలంటూ ఆందోళనలు చేపట్టారు అక్కడి ప్రజలు.కువాన్దిక్ బిషింబయెవ్(44) కజకస్తాన్ దేశపు మాజీ ఆర్థిక మంత్రి. ఈయన బంధువు పేరిట ఉన్న ఓ రెస్టారెంట్లో గతేడాది నవంబర్‌లో ఆయన సతీమణి సల్తానత్ నుకెనోవా(31) అనుమానాస్పద రీతిలో మృతి చెందిది. అంతకు ముందు ఒకరోజు అంతా ఆ జంట ఆ హోటల్లోనే గడిపింది.అయితే విచారణలో ఆయనే ఆమెను దారుణంగా హింసించి చంపినట్లు తేలింది. దీంతో ఆయన కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. ఈలోపు ఆ హోటల్ సీపీ టీవీ ఫుటేజీలు బయటకు వచ్చాయి. జుట్టుపట్టి ఈడ్చి కొట్టి.. ఇష్టానుసారం తన్ని.. సుమారు ఎనిమిది గంటల పాటు ఆ కిరాతకం కొనసాగింది. రక్తపు మడుగులో అచేతనంగా భార్య పడి ఉన్నప్పటికీ ఆమె బాగానే ఉందంటూ హోటల్ సిబ్బందితో బిషింబయెవ్ చెప్పడం కూడా వీడియోలో రికార్డయ్యింది. చివరకు 12 గంటల తర్వాత ఆంబులెన్స్ అక్కడికి చేరుకోగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు.తలకు, ముక్కుకు బలమైన గాయం కావడం, ఒంటిపై పలు చోట్ల గాయాల్ని శవ పరీక్షలో గుర్తించారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో.. సీసీ టీవీ ఫుటేజీ సహా సాక్ష్యాలన్నింటిని మాయం చేసేందుకు బిషింబయెవ్ ప్రయత్నించారని పోలీసులు తేల్చారు. అంతేకాదు.. తన భార్య మానసిక స్థితి బాగోలేదని, ఈ క్రమంలోనే తనకు తాను గాయాలు చేసుకుని ఆమె చనిపోయిందని న్యాయస్థానాల్ని నమ్మించే యత్నం చేశాడు కూడా.అయితే.. 8 గంటలపాటు సాగిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకు రావడంతో ఆ భర్త అకృత్యం వెలుగు చూసింది. భార్యను అలా ఎందుకు చంపాడో మాత్రం ఇంకా నోరు విప్పలేదు నిందితుడు. అయితే ఆమెను అంత క్రూరంగా చంపిన ఆ మాజీ మంత్రిని కఠినంగా శిక్షించాలంటూ అక్కడి ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గృహ హింస చట్టం గురించి విస్తృతంగా చర్చ జరిగింది అక్కడ. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఆ దేశపు సుప్రీం కోర్టులో జరుగుతోంది. కజకస్తాన్ చరిత్రలోనే తొలిసారి ఈ కేసు విచారణను లైవ్ టెలికాస్ట్ చేయబోతోంది ఆ దేశ అత్యున్నన్యాయస్థానం. బిషింబయెవ్ నేరం గనుక రుజువు అయితే అక్కడి చట్టాల ప్రకారం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షపడుతుంది. -
భారత రెజ్లర్ సరిత స్వర్ణ సంబరం...
భారత మహిళా స్టార్ రెజ్లర్ సరితా మోర్ ఈ ఏడాది తన ఖాతాలో తొలి స్వర్ణ పతకాన్ని జమ చేసుకుంది. కజకిస్తాన్‌లో జరుగుతున్న యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ టోర్నీ బొలాత్ టర్లీఖనోవ్ కప్‌లో సరితా 59 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. సరిత గెలిచిన మూడు బౌట్లూ టెక్నికల్ సుపీరియారిటీ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం రాగానే విజేతగా ప్రకటిస్తారు) పద్ధతిలోనే రావడం విశేషం. ఫైనల్లో సరిత 10–0తో జాలా అలియెవ్ (అజర్బైజాన్)పై, సెమీఫైనల్లో 12–2తో ఐజాన్ ఇస్మగులోవా (కజకిస్తాన్)పై, రెండో రౌండ్లో 11–0తో డయానా (కజకిస్తాన్)పై గెలిచింది. ఇదే టోర్నీలో భారత రెజ్లర్లు మనీషా (65 కేజీలు) స్వర్ణం... బిపాసా (72 కేజీలు) రజతం, సుష్మా (55 కేజీలు) కాంస్యం సాధించారు. -
మధ్యాసియాలో విద్యుత్ సంక్షోభం
మాస్కో: మధ్యాసియా దేశాలు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్‌ల్లో మంగళవారం విద్యుత్ సంక్షోభం తలెత్తింది. చాలా నగరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. టర్కిస్తాన్‌లోని కొన్ని నగరాల్లో సైతం ఈ సంక్షోభం కనిపించింది. ఈ దేశాల్లో హఠాత్తుగా తలెత్తిన విద్యుత్ సరఫరా అంతరాయంతో పలు పౌర సేవలు నిలిచిపోయాయి. లక్షలాదిమంది ప్రజలు చీకట్లో మగ్గిపోయారు. ఈ అంతరాయానికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే కజకిస్తాన్‌లో పవర్‌లైన్ ఫెయిల్యూర్ ఇందుకు కారణమని ఉజ్బెకిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ మూడు దేశాలు వన్ పవర్ వ్యవస్థతో అనుసంధానమై ఉన్నాయి. విద్యుత్ అంతరాయం కారణంగా తాష్కెంట్‌కు విమానాల రాకపోకలను నిలిపివేశారు. (చదవండి: ఉరిమి ఉరిమి.. యూఏఈ నెత్తిన! ఎందుకిలా జరుగుతోంది?) -
అంతరిక్షంలో సినిమా షూటింగ్ సక్సెస్
మాస్కో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 12 రోజుల పాటు సినిమా షూటింగ్ విజయవంతంగా ముగించుకుని రష్యా సినిమా బృందం తిరిగి భూమికి చేరుకుంది. ఒలెగ్ నోవిట్స్కీ, యులియా పెరెసిల్డ్, క్లిమ్ షిపెంకోలతో కూడిన సోయుజ్ అంతరిక్ష నౌక ఆదివారం కజఖ్‌స్తాన్‌లోని మైదాన ప్రాంతంలో దిగింది. ఆ వెంటనే యులియా, నోవిట్స్కీలు సీట్లలో ఉండగానే 10 నిమిషాలపాటు సినిమాలోని కొన్ని దృశ్యాలను చిత్రీకరించారు. అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఆ ముగ్గురూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని అధికారులు తెలిపారు. దర్శకుడు షిపెంకో చాలెంజ్ అనే సినిమా చిత్రీకరణ కోసం నటి యులియాతో కలిసి ఈ నెల 5వ తేదీన అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. సర్జన్ పాత్ర పోషిస్తున్న యులియా అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఓ వ్యోమగామికి అత్యవసర చికిత్స చేసే సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. అనారోగ్యం బారిన పడిన వ్యోమగామి పాత్రను ఇప్పటికే 6 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉన్న నోవిట్స్కీ పోషిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోందని, సినిమా రిలీజ్ ముహూర్తం ఖరారు కాలేదని సమాచారం. -
సెక్స్‌డాల్‌తో 8 నెలల కాపురం..ఆపై విడాకులు!
కజకిస్థాన్: అతడొక మంచి బాడీబిల్డర్..అందగాడు. అతని కోసం అందమైన అమ్మాయిలు క్యూలో నిలుచుంటారు. కానీ అతను మాత్రం.. ఒక సెక్స్టాయ్ మీద మనసు పడ్డాడు. అంతేకాకుండా, దాన్ని పెళ్లి కూడా చేసుకున్నాడు. 8 నెలలకే విడాకులు కూడా ఇచ్చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కజకిస్థాన్‌కు చెందిన యూరి టోలోచ్కో ‘మార్గో ’ అనే సెక్స్‌టాయ్‌ను వివాహం చేసుకున్నాడు. దీన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నాడు. ఇది అప్పట్లో చాలా వైరల్ అయ్యింది. కొద్ది రోజుల తర్వాత నిజమైన భార్యభర్తల మాదిరిగానే మాఇద్దరికి పడట్లేదని మరొసారి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. క్రిస్టమస్‌కి ముందు తన టాయ్ కిందపడి విరిగిపోయింది. అయితే, టాయ్‌ను బాగుచేయడానికి స్టోర్‌కి పంపానని తెలిపాడు. ఈ క్రమంలో టోలోచ్కో ‘లోలా’ అనే మరొక టాయ్‌తో ప్రేమలో పడ్డానని తెలిపాడు. లోలా చాలా నాజుకుగా, అచ్చం అమ్మాయిలాంటి శరీరాన్ని కల్గిఉందని తెలిపాడు. టోలోచ్కో 8 నెలల తర్వాత తన ‘మార్గోటాయ్’కు డైవర్స్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. అయితే, టోలోచ్కో సోషల్‌మీడియా వేదికగా అభిమానులకు తన కొత్తటాయ్ను పరిచయం చేశాడు. దీనిపేరు ‘లోలా’ అని.. తొందర్లోనే ఆమెను పెళ్లి చేసుకుంటున్నానని పోస్ట్ చేశాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం..‘సెక్స్టాయ్తో పడక సుఖం మాత్రమే...కానీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అన్ని విషయాల్లో తోడుగా ఉంటుంది’.. ‘ఇదేం వింతరా బాబోయ్’ అని మరికొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. చదవండి: భర్తను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య! -
భారత్ శుభారంభం
మనీలా: ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. మంగళవారం గ్రూప్ ‘బి’లో కజకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4–1తో ఘనవిజయం సాధించింది. ముందుగా జరిగిన మూడు సింగిల్స్ పోటీల్లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, శుభాంకర్ డే విజయం సాధించారు. తొలి డబుల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్–చిరాగ్ శెట్టి జోడీ కంగుతినగా, రెండో డబుల్స్‌లో ఎం.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల ద్వయం గెలుపొందింది. ఈ విజయంతో భారత్ క్వార్టర్ ఫైనల్స్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. తొలి మ్యాచ్ బరిలోకి దిగిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ కేవలం 23 నిమిషాల్లోనే ప్రత్యర్థిని ఓడించాడు. శ్రీకాంత్ 21–10, 21–7తో డిమిత్రి పనరిన్‌పై అలవోక విజయం సాధించాడు. లక్ష్యసేన్ కూడా 21 నిమిషాల్లో ఆట ముగించాడు. అతను 21–13, 21–8తో అర్తుర నియజోవ్‌పై నెగ్గగా... శుభాంకర్ డే 21–11, 21–5తో కైత్‌మురత్ కుల్మతోవ్‌పై గెలిచేందుకు 26 నిమిషాలే పట్టింది. డబుల్స్‌లో ప్రణయ్–చిరాగ్ శెట్టి జోడీ 21–18, 16–21, 19–21తో నియజోవ్–పనరిన్ జంట చేతిలో ఓడింది. మరో డబుల్స్‌లో అర్జున్–ధ్రువ్ కపిల ద్వయం 21–14, 21–8తో నికిట బ్రగిన్–కైత్‌మురత్ జోడీపై వరుస గేముల్లో గెలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ మంగళవారం బరిలోకి దిగలేదు. గురువారం జరిగే తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ ఆడుతుంది. ఒక్కో గ్రూప్ నుంచి రెండేసి జట్లు క్వార్టర్స్ చేరతాయి. -
దేశ సరిహద్దులు దాటిన ప్రేమ
-
చరిత్రలో ఈ రోజు
కప్పు - సాసర్ చరిత్రలో ఈ రోజు తూర్పు కజకిస్తాన్‌లో రష్యా రిపబ్లిక్ అణుపరీక్ష నిర్వహించింది (1984). మురౌరా దీవిలో ఫ్రాన్స్ అణుపరీక్ష నిర్వహించింది (1977). రష్యా స్పుత్నిక్ 52, మోల్నియా 1-13 సమాచార ఉపగ్రహాలను ప్రయోగించింది (1970). ఓ నిమిషం స్నానం ముగించే ముందు పమిస్ స్టోన్‌తో పాదాలను సున్నితంగా రుద్ది కడగాలి. ఇలా చేస్తే మృతకణాలతోపాటు పాదాలకంటిన దుమ్ము పూర్తిగా పోతుంది. పొడి చర్మం అయితే స్నానం పూర్తయిన తర్వాత పాదాలను తడి లేకుండా తుడిచి ఏదైనా ఆయిల్ కానీ, క్రీమ్ కానీ రాస్తే మంచిది. ఓ విషయం మనదేశంలో ఎడారుల విస్తీర్ణం 2,25,000 చ. కి.మీలు. ఎడారి గ్రామాల్లో నీటిని నిల్వ చేయడానికి జోహాద్ (ఊరంతటికీ సరిపోయే పెద్ద సిమెంట్ తొట్టి)లను నిర్మిస్తారు. ఇందులో వర్షపునీటిని నిల్వ చేస్తారు. ఓ ప్రయోగం కరెంట్ పోయినప్పుడు ఇంట్లో సృజనాత్మకమైన దీపాన్ని వెలిగించే ఆలోచన ఇది. ఒక రీచార్జబుల్ లైట్ఎమిటింగ్ డయోడ్ (ఎల్ఈడీ), ఖాళీ వైన్‌బాటిల్ ఉంటే చాలు. చీకటింటిని ఒక రొమాంటిక్ స్పాట్‌గా మార్చేయవచ్చు! బ్రిటన్‌కు చెందిన ఒక ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ ఈ ‘బాటిల్లైట్’కు రూపకల్పన చేసింది. గంటసేపు చార్జింగ్ పెడితే ఆ ఎల్ఈడీ దాదాపు రెండున్నర గంటలు వెలుగుతుంది. యూఎస్బీ సాకెట్ ద్వారా ఎల్ఈడీకి చార్జింగ్ పెట్టచ్చు. దీని ధర సుమారు వెయ్యి రూపాయలు.