మధ్యాసియాలో విద్యుత్‌ సంక్షోభం | Power Blackouts Sweep Across Central Asia After Regional Grid Issue | Sakshi
Sakshi News home page

మధ్యాసియాలో విద్యుత్‌ సంక్షోభం

Published Wed, Jan 26 2022 3:56 PM | Last Updated on Wed, Jan 26 2022 3:56 PM

Power Blackouts Sweep Across Central Asia After Regional Grid Issue - Sakshi

మాస్కో: మధ్యాసియా దేశాలు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్‌ల్లో మంగళవారం విద్యుత్‌ సంక్షోభం తలెత్తింది. చాలా నగరాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. టర్కిస్తాన్‌లోని కొన్ని నగరాల్లో సైతం ఈ సంక్షోభం కనిపించింది. ఈ దేశాల్లో హఠాత్తుగా తలెత్తిన విద్యుత్‌ సరఫరా అంతరాయంతో పలు పౌర సేవలు నిలిచిపోయాయి. లక్షలాదిమంది ప్రజలు చీకట్లో మగ్గిపోయారు.

ఈ అంతరాయానికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే కజకిస్తాన్‌లో పవర్‌లైన్‌ ఫెయిల్యూర్‌ ఇందుకు కారణమని ఉజ్బెకిస్తాన్‌ ఆరోపిస్తోంది. ఈ మూడు దేశాలు వన్‌ పవర్‌ వ్యవస్థతో అనుసంధానమై ఉన్నాయి. విద్యుత్‌ అంతరాయం కారణంగా తాష్కెంట్‌కు విమానాల రాకపోకలను నిలిపివేశారు. (చదవండి: ఉరిమి ఉరిమి.. యూఏఈ నెత్తిన! ఎందుకిలా జరుగుతోంది?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement