![Kazakhstan Bodybuilder Divorced His Sex Doll Wife And Introduced New Partner - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/17/toy_0.jpg.webp?itok=HLTvp803)
కజకిస్థాన్: అతడొక మంచి బాడీబిల్డర్..అందగాడు. అతని కోసం అందమైన అమ్మాయిలు క్యూలో నిలుచుంటారు. కానీ అతను మాత్రం.. ఒక సెక్స్‌టాయ్ మీద మనసు పడ్డాడు. అంతేకాకుండా, దాన్ని పెళ్లి కూడా చేసుకున్నాడు. 8 నెలలకే విడాకులు కూడా ఇచ్చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కజకిస్థాన్‌కు చెందిన యూరి టోలోచ్కో ‘మార్గో ’ అనే సెక్స్‌టాయ్‌ను వివాహం చేసుకున్నాడు. దీన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నాడు. ఇది అప్పట్లో చాలా వైరల్ అయ్యింది. కొద్ది రోజుల తర్వాత నిజమైన భార్యభర్తల మాదిరిగానే మాఇద్దరికి పడట్లేదని మరొసారి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. క్రిస్టమస్‌కి ముందు తన టాయ్ కిందపడి విరిగిపోయింది. అయితే, టాయ్‌ను బాగుచేయడానికి స్టోర్‌కి పంపానని తెలిపాడు.
ఈ క్రమంలో టోలోచ్కో ‘లోలా’ అనే మరొక టాయ్‌తో ప్రేమలో పడ్డానని తెలిపాడు. లోలా చాలా నాజుకుగా, అచ్చం అమ్మాయిలాంటి శరీరాన్ని కల్గిఉందని తెలిపాడు. టోలోచ్కో 8 నెలల తర్వాత తన ‘మార్గోటాయ్’కు డైవర్స్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. అయితే, టోలోచ్కో సోషల్‌మీడియా వేదికగా అభిమానులకు తన కొత్తటాయ్‌ను పరిచయం చేశాడు. దీనిపేరు ‘లోలా’ అని.. తొందర్లోనే ఆమెను పెళ్లి చేసుకుంటున్నానని పోస్ట్ చేశాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం..‘సెక్స్‌టాయ్‌తో పడక సుఖం మాత్రమే...కానీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అన్ని విషయాల్లో తోడుగా ఉంటుంది’.. ‘ఇదేం వింతరా బాబోయ్’ అని మరికొందరు ఫన్నీగా కామెంట్‌లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment