Anasuya Bharadwaj Shares Photo With Unknown Person, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Anasuya Bhardwaj: అనసూయ పక్కన ఉన్న ఈ కొత్త వ్యక్తి ఎవరు? అతడితో అంత క్లోజ్‌ ఏంటి..

Published Thu, Oct 27 2022 1:09 PM | Last Updated on Thu, Oct 27 2022 2:31 PM

Anasuya Bharadwaj Shares A Photo With Unknown Person Goes Viral - Sakshi

అనసూయ భరద్వాజ్‌.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదని పేరు. యాంకర్‌గా, నటిగా తనకంటూ పరిశ్రమంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్‌ మీడియాలో తను చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరచూ హాట్‌ హాట్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ గ్లామర్‌ షో చేస్తుంది. ఈ క్రమంలో ఆమె తీవ్ర స్థాయిలో ట్రోల్స్‌ను కూడా ఎదుర్కుంటుంది. అయితే అవేవి పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంది పోతుంది ఈ రంగమ్మత్త. ఇదిలా ఉంటే ప్రస్తుతం అనసూయ తానా వేడుకల నేపథ్యంలో అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. దీపావళి పండగను కూడా కుటుంబానికి దూరంగా ఫ్రెండ్స్‌తో కలిసి సెలబ్రెట్ చేసుకుంది.

అక్కడ ఆమె సందడి చేస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్‌ చేస్తూ వస్తోంది ఈ యాంకరమ్మ. ఈ క్రమంలో తన ఇన్‌స్టా స్టోరీలో ఓ కొత్త వ్యక్తితో క్లోజ్‌గా దిగిన ఫొటో దర్శనం ఇచ్చింది. దీంతో నెటిజన్ల దృష్టి ఆ కొత్త వ్యక్తిపై పడింది. తన పోస్ట్‌లో అనసూయ అతడికి బర్త్‌డే విషెస్‌ చెబుతూ ఆసక్తికరంగా క్యాప్షన్‌ ఇవ్వడంతో అతనేవరో తెలుసుకోనుందుకే నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. అనసూయ అతడిని ఉద్దేశిస్తూ.. ‘నా సంరక్షకుడు, స్నేహితుడు.. నేను జెర్రీ అయితే తను టామ్‌ అవుతాడు’ హ్యాపీ బర్త్‌డే  అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు ఈ సందర్భంగా అతడి పేరు ఉజ్వల్‌ అని కూడా పేర్కొంది. 

దీంతో ఎవరీ ఉజ్వల్‌ అంటూ నెటజన్లు ఆరా తీయగా అతడు ఓ నటుడని తెలిసింది.  తెలుగులో అతడు నటించింది ఒకేఒక్క సినిమా. అది కూడా రిలీజ్‌కు నోచుకోలేదు. అదేంటంటే అడవి శేష్‌ స్వీయ దర్శకత్వంలో హీరోగా 2013లో నటించిన మూవీ ‘కిస్‌’. దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఇందులో ఉజ్వల్‌ ఓ ప్రధాన పాత్ర పోషించాడట. ఈ సినిమా తర్వాత ఉజ్వల్‌ మరే చిత్రంలో నటించలేదు. ప్రస్తుతం అతడు అమెరికాలో నివసిస్తున్నాడు. అయితే అతడు అనసూయకు అంత క్లోజ్‌ ఎలా అయ్యాడంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనసూయ అమెరికా వెళ్లినప్పుడు అతడిని కలిసిందట. ఈ క్రమంలో ఇద్దరు మంచి స్నేహితులు అయినట్లు తెలుస్తోంది. 

చదవండి:
ఓటీటీకి వచ్చేస్తోన్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’! స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement