క్వార్టర్స్‌లో తెలుగు తేజాలు శశాంక్, రష్మిక | theertha shashank and srivalli rashmika enters quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో తెలుగు తేజాలు శశాంక్, రష్మిక

Published Thu, Jul 21 2016 10:38 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

క్వార్టర్స్‌లో తెలుగు తేజాలు శశాంక్, రష్మిక

క్వార్టర్స్‌లో తెలుగు తేజాలు శశాంక్, రష్మిక

హైదరాబాద్: తెలంగాణ కుర్రాడు తీర్థ శశాంక్ జోరుమీదున్నాడు. సింగపూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్-5 టోర్నీలో అతను సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కల్లాంగ్ టెన్నిస్ సెంటర్‌లో బుధవారం జరిగిన బాలుర సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తీర్థ శశాంక్ 6-3, 6-3తో ఐదో సీడ్ ఆర్మిన్ రోస్తామి (ఇరాన్)కి షాకిచ్చాడు.

బాలుర డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో ద్రోణ వాలియాతో జతకట్టిన శశాంక్ 4-6, 7-5, 10-8తో దర్శన్ సురేశ్ (మలేసియా)-షెంగ్ యిన్ స్టిఫెన్ (చైనా)లపై చెమటోడ్చి నెగ్గాడు. బాలికల సింగిల్స్‌లో తెలుగమ్మాయి శ్రీవల్లి రష్మిక కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 6-3, 6-2తో ఎనిమిదో సీడ్ యిమ్ అష్లె (చైనా)పై సంచలన విజయం సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement