theertha shashank
-
ప్రిక్వార్టర్స్‌లో తీర్థశశాంక్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) పురుషుల టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ ఎం. తీర్థ శశాంక్ నిలకడగా రాణిస్తున్నాడు. పంజాబ్‌లోని జసోవాల్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో శశాంక్ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. సోమవారం పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో తీర్థ శశాంక్ (తెలంగాణ) 6–3, 6–4తో ఎనిమిదో సీడ్ అనురాగ్ (ఢిల్లీ)పై విజయం సాధించాడు. -
సెమీస్‌లో శ్రీవల్లి జోడి
► సింగిల్స్‌లో తీర్థ శశాంక్ ఓటమి సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్-5 టోర్నమెంట్లో తెలుగమ్మాయి శ్రీవల్లి రష్మిక జోడి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తెలంగాణ కుర్రాడు తీర్థ శశాంక్ సింగిల్స్, డబుల్స్‌లో పరాజయం చవిచూశాడు. సింగపూర్‌లోని కల్లాంగ్ టెన్నిస్ సెంటర్లో గురువారం జరిగిన బాలికల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి-దివ్యవాణి (భారత్) జోడి 6-4, 6-7 (8/3), 10-8తో వాన్ స్కైలర్-అలిసియా యూ (హాంకాంగ్) జంటపై గెలుపొందింది. సింగిల్స్‌లో ఆమె 2-6, 3-6తో టాప్ సీడ్ గ్లౌడియా (హాంకాంగ్) జోడి చేతిలో ఓడింది. బాలుర సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తీర్థ శశాంక్ 3-6, 3-6తో టాప్ సీడ్ హు చెన్ యూ (తైపీ) చేతిలో పరాజయం చవిచూశాడు. డబుల్స్‌లో గిరిధరన్ (సింగపూర్)-అలీ మూరాజ్ (పాకిస్తాన్) జంట 3-6, 7-5, 14-12తో తీర్థ శశాంక్-ద్రోణ వాలియా (భారత్) జోడీని ఇంటిదారి పట్టించింది. -
క్వార్టర్స్‌లో తెలుగు తేజాలు శశాంక్, రష్మిక
హైదరాబాద్: తెలంగాణ కుర్రాడు తీర్థ శశాంక్ జోరుమీదున్నాడు. సింగపూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్-5 టోర్నీలో అతను సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కల్లాంగ్ టెన్నిస్ సెంటర్లో బుధవారం జరిగిన బాలుర సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తీర్థ శశాంక్ 6-3, 6-3తో ఐదో సీడ్ ఆర్మిన్ రోస్తామి (ఇరాన్)కి షాకిచ్చాడు. బాలుర డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో ద్రోణ వాలియాతో జతకట్టిన శశాంక్ 4-6, 7-5, 10-8తో దర్శన్ సురేశ్ (మలేసియా)-షెంగ్ యిన్ స్టిఫెన్ (చైనా)లపై చెమటోడ్చి నెగ్గాడు. బాలికల సింగిల్స్‌లో తెలుగమ్మాయి శ్రీవల్లి రష్మిక కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 6-3, 6-2తో ఎనిమిదో సీడ్ యిమ్ అష్లె (చైనా)పై సంచలన విజయం సాధించింది.