సెమీస్‌లో శ్రీవల్లి జోడి
► సింగిల్స్‌లో తీర్థ శశాంక్ ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్-5 టోర్నమెంట్లో తెలుగమ్మాయి శ్రీవల్లి రష్మిక జోడి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తెలంగాణ కుర్రాడు తీర్థ శశాంక్ సింగిల్స్, డబుల్స్‌లో పరాజయం చవిచూశాడు. సింగపూర్‌లోని కల్లాంగ్ టెన్నిస్ సెంటర్లో గురువారం జరిగిన బాలికల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి-దివ్యవాణి (భారత్) జోడి 6-4, 6-7 (8/3), 10-8తో వాన్ స్కైలర్-అలిసియా యూ (హాంకాంగ్) జంటపై గెలుపొందింది.
సింగిల్స్‌లో ఆమె 2-6, 3-6తో టాప్ సీడ్ గ్లౌడియా (హాంకాంగ్) జోడి చేతిలో ఓడింది. బాలుర సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తీర్థ శశాంక్ 3-6, 3-6తో టాప్ సీడ్ హు చెన్ యూ (తైపీ) చేతిలో పరాజయం చవిచూశాడు. డబుల్స్‌లో గిరిధరన్ (సింగపూర్)-అలీ మూరాజ్ (పాకిస్తాన్) జంట 3-6, 7-5, 14-12తో తీర్థ శశాంక్-ద్రోణ వాలియా (భారత్) జోడీని ఇంటిదారి పట్టించింది.