
బెంగళూరు: భారత ఆటగాడు దివిజ్ శరణ్ బెంగళూరు ఓపెన్‌లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో దివిజ్ (భారత్)–ఎల్గిన్ (రష్యా) జోడి 6–3, 6–0తో క్రొయేషియా జంట ఇవాన్ సబనోవ్–మాటెజ్ సబనోవ్‌పై విజయం సాధించింది.
యూకీ బాంబ్రీకి షాక్
భారత యువ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్ జోరు బెంగళూరు ఓపెన్‌లోనూ కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో సహచరుడు, టాప్ సింగిల్స్ ప్లేయర్ యుకీ బాంబ్రీపై 6–4, 6–0తో విజయం సాధించి నాగల్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఫైనల్లో బ్రిటన్‌కు చెందిన జే క్లార్క్‌తో నాగల్ తలపడనున్నాడు. ఈ మ్యాచ్ ఓటమితో ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాలో చోటు దక్కించుకోవాలనుకున్న బాంబ్రీ ఆశలు సన్నగిల్లాయి.
Comments
Please login to add a commentAdd a comment