
యాంట్‌వర్ప్ (బెల్జియం): భారత డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ దివిజ్ శరణ్ తన కెరీర్‌లో మూడో ఏటీపీ టూర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. యూరోపియన్ ఓపెన్ ట్రోఫీ టోర్నీలో తన భాగస్వామి స్కాట్ లిప్‌స్కీ (అమెరికా)తో కలిసి దివిజ్ శరణ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు.
ఫైనల్లో దివిజ్ శరణ్–స్కాట్ లిప్‌స్కీ ద్వయం 6–4, 2–6, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–జూలియో పెరాల్టా (చిలీ) జోడీపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన దివిజ్–లిప్‌స్కీ జంటకు 31,910 యూరోల (రూ. 24 లక్షల 38 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment