
భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీలో బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం టైటిల్‌ను కొల్లగొట్టింది. ఈ జంట ఫైనల్లో కుహ్లోఫ్- స్కుప్సికిటో ద్వయంపై 6-3, 2-6, 10-8 తేడాతో విజయం సాధించింది.
తద్వారా ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్‌ను సాధించిన అతి పెద్ద వయస్కుడిగా(43 ఏళ్లు) రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో కెనడాకు చెందిన డానియెల్ నెస్టర్ రికార్డును బోపన్న బద్దలు కొట్టాడు. నెస్టర్ 42 ఏళ్ల వయసులో 2015 సిన్సినాటి మాస్టర్స్ టోర్నీని గెలుచుకున్నాడు. ఇక బోపన్న కెరీర్‌లో ఇది ఐదో ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్. కాగా బోపన్న 2017 మాంటేకార్లో ఏటీపీ మాస్టర్స్ టైటిల్ తర్వాత మళ్లీ టోర్నీ విజేతగా నిలవడం ఇదే.
మ్యాచ్ విషయానికి వస్తే బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ జోడి.. కుహ్లోఫ్- స్కుప్సికిటో ద్వయంపై 6-3, 2-6, 10-8 తేడాతో విజయం సాధించారు. తొలి సెట్‌ను 6-3తో గెలిచినప్పటికి రెండో సెట్‌ను ప్రత్యర్థికి కోల్పోయారు. ఇక కీలకమైన మూడో సెట్‌లో బోపన్న జోడి ఫుంజుకొని 10-8 తేడాతో సెట్‌ను కైవసం చేసుకోవడంతో పాటు టైటిల్‌ను కొల్లగొట్టారు.
Indian Wells CHAMPS!
— Tennis TV (@TennisTV) March 19, 2023
The moment 43-year-old @rohanbopanna & 35-year-old Matthew Ebden take the title in #TenisParadise 🌴 🏆 pic.twitter.com/9NEeF8MrYD