doubles tennis star
-
43 ఏళ్ల వయసులో భారత టెన్నిస్ స్టార్ కొత్త చరిత్ర
భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీలో బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం టైటిల్‌ను కొల్లగొట్టింది. ఈ జంట ఫైనల్లో కుహ్లోఫ్- స్కుప్సికిటో ద్వయంపై 6-3, 2-6, 10-8 తేడాతో విజయం సాధించింది. తద్వారా ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్‌ను సాధించిన అతి పెద్ద వయస్కుడిగా(43 ఏళ్లు) రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో కెనడాకు చెందిన డానియెల్ నెస్టర్ రికార్డును బోపన్న బద్దలు కొట్టాడు. నెస్టర్ 42 ఏళ్ల వయసులో 2015 సిన్సినాటి మాస్టర్స్ టోర్నీని గెలుచుకున్నాడు. ఇక బోపన్న కెరీర్లో ఇది ఐదో ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్. కాగా బోపన్న 2017 మాంటేకార్లో ఏటీపీ మాస్టర్స్ టైటిల్ తర్వాత మళ్లీ టోర్నీ విజేతగా నిలవడం ఇదే. మ్యాచ్ విషయానికి వస్తే బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ జోడి.. కుహ్లోఫ్- స్కుప్సికిటో ద్వయంపై 6-3, 2-6, 10-8 తేడాతో విజయం సాధించారు. తొలి సెట్‌ను 6-3తో గెలిచినప్పటికి రెండో సెట్‌ను ప్రత్యర్థికి కోల్పోయారు. ఇక కీలకమైన మూడో సెట్లో బోపన్న జోడి ఫుంజుకొని 10-8 తేడాతో సెట్‌ను కైవసం చేసుకోవడంతో పాటు టైటిల్‌ను కొల్లగొట్టారు. Indian Wells CHAMPS! The moment 43-year-old @rohanbopanna & 35-year-old Matthew Ebden take the title in #TenisParadise 🌴 🏆 pic.twitter.com/9NEeF8MrYD — Tennis TV (@TennisTV) March 19, 2023 చదవండి: టెస్టు చరిత్రలో లంక తరపున అత్యంత చెత్త రికార్డు క్లబ్ మేనేజర్‌తో గొడవ.. పీఎస్జీని వీడనున్నాడా? -
టాప్–50లో పేస్
న్యూఢిల్లీ: భారత వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ఏడు నెలల తర్వాత మళ్లీ టాప్–50లో చోటు దక్కించుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో పేస్ 14 స్థానాలను మెరుగుపరుచుకొని 47వ ర్యాంకును అందుకున్నాడు. అమెరికాకు చెందిన జేమ్స్ సెరిటానితో కలిసి తాజాగా న్యూపోర్ట్ బీచ్ టైటిల్ నెగ్గిన పేస్ ఖాతాలో 125 ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి. భారత్ తరఫున డబుల్స్‌లో రోహన్ బోపన్న (20వ స్థానం) అత్యుత్తమ స్థానంలో నిలవగా, దివిజ్ శరణ్ మూడు స్థానాలు ఎగబాకి తన కెరీర్ బెస్ట్ 45వ స్థానాన్ని దక్కించుకున్నాడు. సింగిల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ 118వ ర్యాంకులో, రామ్‌కుమార్ రామనాథన్ 140వ స్థానంలో ఉండగా... సుమిత్ నాగల్ (218), ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (244), శ్రీరామ్ బాలాజీ (391) తర్వాతి స్థానాల్లో నిలిచారు. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ సానియా మీర్జా ఒక స్థానం పడిపోయి 14వ ర్యాంక్‌కు చేరుకుంది. -
దివిజ్ జంటకు టైటిల్
యాంట్‌వర్ప్ (బెల్జియం): భారత డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ దివిజ్ శరణ్ తన కెరీర్లో మూడో ఏటీపీ టూర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. యూరోపియన్ ఓపెన్ ట్రోఫీ టోర్నీలో తన భాగస్వామి స్కాట్ లిప్స్కీ (అమెరికా)తో కలిసి దివిజ్ శరణ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో దివిజ్ శరణ్–స్కాట్ లిప్స్కీ ద్వయం 6–4, 2–6, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–జూలియో పెరాల్టా (చిలీ) జోడీపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన దివిజ్–లిప్స్కీ జంటకు 31,910 యూరోల (రూ. 24 లక్షల 38 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
బోపన్న జంట ఓటమి
మోంటెకార్లో: ఈ సీజన్లో భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో తన భాగస్వామి ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా)తో బరిలోకి దిగిన బోపన్న క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ బోపన్న-మెర్జియా ద్వయం 2-6, 3-6తో నాలుగో సీడ్ జేమీ ముర్రే (బ్రిటన్)-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జోడీ చేతిలో ఓడిపోయింది. గంటపాటు జరిగిన ఈ మ్యా చ్లో బోపన్న జోడీ నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేయడంతోపాటు తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. ఈ ఏడాది ఎనిమిది టోర్నీలలో పాల్గొన్న బోపన్న కేవలం ఒక టోర్నీలో మాత్రమే ఫైనల్‌కు చేరుకున్నాడు.