
పాలెంబాంగ్: టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ ఆసియా క్రీడల టెన్నిస్‌లో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ (భారత్) జంట స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–దివిజ్ జోడీ 6–3, 6–4తో అలెగ్జాండర్ బుబ్‌లిక్–డెనిస్ యెవ్‌సెయెవ్ (కజకిస్తాన్) ద్వయంపై గెలుపొందింది.
తమ కెరీర్‌లో తొలిసారి ఏషియాడ్ డబుల్స్ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. సెమీఫైనల్లో ప్రజ్నేశ్ 2–6, 2–6తో డెనిస్ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment