న్యూఢిల్లీ: తుది జట్టులో ఆడే అవకాశం లేకపోవడం తో... ఆ సమయాన్ని అమెరికాలో ప్రాక్టీస్ చేసుకునేందుకు కేటాయించాలని భారత డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ దివిజ్ శరణ్ నిర్ణయించుకున్నాడు. ఫలితంగా ఈనెల 6, 7 తేదీల్లో చైనాతో జరిగే డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్ ఆడేందుకు చైనా వెళ్లడం లేదని తెలిపాడు.
డబుల్స్‌లో లియాండర్ పేస్–బోపన్న జంట బరిలోకి దిగడం ఖాయం కాబట్టి దివిజ్‌కు మ్యాచ్ ఆడే అవకాశం రావడం కష్టమే. ఈ మేరకు దివిజ్ తన నిర్ణయాన్ని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) అధికారులకు తెలపగా... వారు దానికి అంగీకరించారు. తన అవసరం ఉంటే వెంటనే చైనాకు వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నానని దివిజ్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment