
న్యూఢిల్లీ: మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత ఆటగాళ్ల పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. మొనాకోలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత డబుల్స్ టాప్ ర్యాంకర్ రోహన్ బోపన్న... రెండో ర్యాంకర్ దివిజ్ శరణ్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు.
దివిజ్ శరణ్–లాస్లో జెరి (సెర్బియా) జంట 2–6, 1–6తో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో... బోపన్న–డొమినిక్ ఇంగ్లోట్ (బ్రిటన్) ద్వయం 6–4, 3–6, 11–13తో మూడో సీడ్ జేమీ ముర్రే (బ్రిటన్)–బ్రూనో సొరెస్ (బ్రెజిల్) జంట చేతిలో ఓడిపోయాయి. తొలి రౌండ్‌లో ఓడిన దివిజ్, బోపన్న జోడీలకు 10,020 యూరోలు (రూ. 7 లక్షల 87 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment