జేమ్స్బాండ్ సినిమాలో సానియా మీర్జా? | sania mirza likely to act in james bond movie | Sakshi
Sakshi News home page

జేమ్స్బాండ్ సినిమాలో సానియా మీర్జా?

Published Tue, Nov 11 2014 7:34 PM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

జేమ్స్బాండ్ సినిమాలో సానియా మీర్జా?

జేమ్స్బాండ్ సినిమాలో సానియా మీర్జా?

ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న హైదరాబాదీ టెన్నిస్ తార సానియా మీర్జా.. జేమ్స్బాండ్ సినిమాలో నటించబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా సానియానే తన ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి వెల్లడించింది. తాను 'బాండింగ్'తో ముందుకెళ్తున్నానని, అందరి శుభాకాంక్షలు తనకు కావాలని చెప్పింది. ఈ విషయం నలుగురికీ తెలియజేయకుండా ఉండలేకపోతున్నానని కూడా అందులో రాసింది.

ఇంతకుముందు కూడా క్రీడాకారులు సినిమాల్లో నటించిన సందర్భాలున్నాయి. 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓ పాటలో మెరిశారు. పరుగుల రాణి అశ్వనీనాచప్ప తన జీవితగాధ ఆధారంగా తీసిన సినిమాలో హీరోయిన్గా చేసింది. ఇప్పుడు సానియా మీర్జా వంతు వచ్చింది. త్వరలోనే మన సానియాను వెండితెర మీద చూసే అవకాశం ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు వస్తుందన్నమాట.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement