james bond movie
-
జేమ్స్ బాండ్ సినిమాకు గుర్తుగా.. బంగారు రోల్స్ రాయిస్ కారు (ఫోటోలు)
-
ఇండియన్ ఇంజనీర్ల అద్భుతం! జేమ్స్‌బాండ్ ఇక్కడ ఫైట్ చేయాల్సిందే
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర విషయాలను నెటిజన్లతో షేర్ చేస్తూ ఉంటాడు. తాజాగా భారత రైల్వేస్ నిర్మించిన రైల్వే బ్రిడ్జ్‌కు ఫిదా అవుతూ ఆసక్తికర పోస్ట్‌ను ట్విటర్లో షేర్ చేశారు. జేమ్స్ బాండ్ సినిమా ఓపెనింగ్ సీన్ అక్కడే..! జమ్ము కశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ను నిర్మిస్తోంది. ఇది నది మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ బ్రిడ్జ్ ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉంది.బ్రిడ్జ్‌పై నుంచి రైల్ పోతే..బ్రిడ్జ్ కింద నుంచి మేఘాలు పోతాయి. ఈ చీనాబ్ బ్రిడ్జ్‌కు సంబంధించిన ఫోటోను ట్విట్టర్లో సివిల్ సర్వెంట్ పోస్ట్‌ను షేర్ చేశారు. దాన్ని ఆనంద్ మహీంద్రా రీపోస్ట్ చేస్తూ...“అసాధారణ విజయం. తదుపరి జేమ్స్ బాండ్ సినిమా ఓపెనింగ్ సీన్?” అంటూ రాసుకొచ్చారు. జేమ్స్ బాండ్ తదుపరి సినిమాలో ఓపెనింగ్ సీన్‌ను ఈ బ్రిడ్జిపై షూట్ చేయాలని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. గత ఏడాది కూడా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ చీనాబ్ బ్రిడ్జ్ సంబంధించిన వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. అప్పుడు ఈ ప్లేస్‌ను తాను సందర్శించే ప్రదేశాల బకెట్ లిస్ట్‌లో యాడ్ చేసుకున్నట్లు తెలిపారు. ఇండియన్ మార్వెల్..! చీనాబ్ నదిపై నిర్మిస్తోన్న ఈ బ్రిడ్జ్ భారత మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైల్వే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ భారత ఇంజనీర్స్ నిర్మించిన మార్వెల్ కట్టడంగా నిలుస్తోంది. ఈ బ్రిడ్జ్‌ను నిర్మాణం 2004లో ప్రారంభమైంది. అయితే ఈ ప్రాంతంలో తరచుగా వీచే గాలుల కారణంగా 2008-09లో పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కానుంది. ఈ బ్రిడ్జ్ గంటకు 260 కిలోమీటర్ల వేగంతో గాలులను తట్టుకోగలదని రైల్వే సీనియర్ అధికారి పేర్కొన్నారు. దీని జీవిత కాలం 120 సంవత్సరాలు. Extraordinary achievement. The scene for the next James Bond movie opening? https://t.co/F8bAVvhwxG — anand mahindra (@anandmahindra) February 14, 2022 చదవండి: ఇలాంటి వాడికి సపోర్ట్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది - ఆనంద్ మహీంద్రా -
జేమ్స్‌బాండ్ సినిమాలో సానియా మీర్జా?
ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న హైదరాబాదీ టెన్నిస్ తార సానియా మీర్జా.. జేమ్స్‌బాండ్ సినిమాలో నటించబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా సానియానే తన ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి వెల్లడించింది. తాను 'బాండింగ్'తో ముందుకెళ్తున్నానని, అందరి శుభాకాంక్షలు తనకు కావాలని చెప్పింది. ఈ విషయం నలుగురికీ తెలియజేయకుండా ఉండలేకపోతున్నానని కూడా అందులో రాసింది. ఇంతకుముందు కూడా క్రీడాకారులు సినిమాల్లో నటించిన సందర్భాలున్నాయి. 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓ పాటలో మెరిశారు. పరుగుల రాణి అశ్వనీనాచప్ప తన జీవితగాధ ఆధారంగా తీసిన సినిమాలో హీరోయిన్గా చేసింది. ఇప్పుడు సానియా మీర్జా వంతు వచ్చింది. త్వరలోనే మన సానియాను వెండితెర మీద చూసే అవకాశం ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు వస్తుందన్నమాట. Truly irresistible. Mirza Sania Mirza ;-) Going ahead with BONDing. Need ur good wishes. #BONDingwithBond — Sania Mirza (@MirzaSania) November 11, 2014