‘మాడ్రిడ్’ దత్తపుత్రుడిగా నాదల్ | Are BIG FOUR of Andy Murray, Rafael Nadal, Novak Djokovic and ... | Sakshi
Sakshi News home page

‘మాడ్రిడ్’ దత్తపుత్రుడిగా నాదల్

Published Tue, May 6 2014 12:51 AM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

‘మాడ్రిడ్’ దత్తపుత్రుడిగా నాదల్ - Sakshi

‘మాడ్రిడ్’ దత్తపుత్రుడిగా నాదల్

 మాడ్రిడ్: ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్‌ను మాడ్రిడ్ సిటీ తమ దత్తపుత్రుడిగా ప్రకటించింది. ఎవరినైనా దత్తపుత్రుడిగాగాని, పుత్రికగాగాని స్వీక రించడమన్నది మాడ్రిడ్ సిటీ దృష్టిలో అతిపెద్ద అవార్డు. గత ఏడాది ఇందుకు జరిగిన ఓటింగ్‌లో నాదల్ ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో నాదల్‌కు మాడ్రిడ్ సిటీ మేయర్ ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ సందర్భంగా నాదల్ మాట్లాడుతూ.. తన ప్రత్యర్థులంటే తనకు గౌరవమని, వారి నుంచి ఆటకు సంబంధించిన విషయాలేగాక జీవితానికి సంబంధించిన విషయాలనూ నేర్చుకున్నానన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement