

భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా భావోద్వేగానికి లోనయ్యారు

తన కుమారుడు ఇజహాన్ ఆరో పుట్టినరోజును ఘనంగా జరిపించారు

ఈ సందర్భంగా కొడుకుతో ఉన్న ఫొటోలను పంచుకున్న సానియా.. ‘‘నా చిన్నారి బాబూ.. నువ్వు ఆరేళ్ల వాడివి అయ్యావంటే నమ్మలేకపోతున్నా. నా నవ్వుకు నువ్వే కారణం. హ్యాపీ బర్త్‌డే మై లడ్డూ’’ అంటూ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు.

కుమారుడిపై ప్రేమను కురిపిస్తూ సానియా మీర్జా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది

కాగా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను 2010లో పెళ్లాడిన సానియా మీర్జా.. అక్టోబరు 30, 2018న కుమారుడికి జన్మనిచ్చారు

అయితే, సానియా- షోయబ్ విడాకులు తీసుకున్నారు.

షోయబ్ మాలిక్ పాక్ నటి సనా జావెద్‌ను పెళ్లాడిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది

ఇక ఇజహాన్ మాత్రం తల్లి సానియా వద్దే ఉంటున్నాడు






