
కెరీర్‌లో 33వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ సాధించాలని ఆశించిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో 22 ఏళ్ల ఖచనోవ్ (రష్యా) 7–5, 6–4తో ప్రపంచ రెండో ర్యాంకర్ జొకోవిచ్‌ను ఓడించి తన కెరీర్‌లో తొలి మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఈ క్రమంలో 2009లో నికొలాయ్ డెవిడెంకో తర్వాత మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన తొలి రష్యా ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. విజేత ఖచనోవ్‌కు 9,73,480 యూరోలు (రూ. 8 కోట్ల 8 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment