కుడిచేయిపై కత్తి గాట్లు.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న టెన్నిస్‌ స్టార్‌ | Tennis Star Nick Kyrgios Says He Had Suicidal Thoughts Self-Harmed | Sakshi
Sakshi News home page

Nick Kyrgios: కుడిచేయిపై కత్తి గాట్లు.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న టెన్నిస్‌ స్టార్‌

Published Fri, Feb 25 2022 2:06 PM | Last Updated on Fri, Feb 25 2022 2:09 PM

Tennis Star Nick Kyrgios Says He Had Suicidal Thoughts Self-Harmed - Sakshi

ఆస్ట్రేలియన్‌ టెన్నిస్‌ స్టార్‌ నిక్‌ కిర్గియోస్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2019 తనకు డార్క్‌ పీరియడ్‌లా అనిపించిందని.. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కలిగాయంటూ పేర్కొన్నాడు. నిక్‌ కిర్గియోస్‌ తన మెంటల్‌ హెల్త్‌ సమస్యలపై గురువారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో సుధీర్ఘ సందేశాన్ని రాసుకొచ్చాడు. 

''ఇదంతా మూడేళ్ల కిందటి మాట. 2019 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నాకు డార్క్‌ పీరియడ్‌ లాంటిది. పైకి మంచిగ కనిపిస్తున్నప్పటికి మానసికంగా చాలా దెబ్బతిన్నా. డ్రగ్స్‌ అలవాటు, విపరీతంగా తాగేయడం, ఫ్యామిలీ గొడవలు నా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశాయి. సరైన నిద్ర లేకపోవడం.. పడుకున్న మంచంపై నుంచి లేచినా ఏదో బరువు ఉన్నట్లుగా అనిపించేది. మెంటల్‌ డిప్రెషన్‌లో ఏం చేస్తున్నానో నాకే తెలియదు. ఎవరిని నమ్మేవాడిని కాదు.. ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు. ఇవన్నీ చూసి ఒక దశలో నాకు ఆత్మహత్య ఆలోచనలు కలిగాయి.

మీరు నా కుడి చేయిని దగ్గరగా గమనిస్తే.. కత్తిగాట్లు కనిపిస్తాయి. ఆ గాట్లు నేనే పెట్టుకున్నా. పిచ్చి ఆలోచనల నుంచి బయటపడడానికి చాలా సమయమే పట్టింది. ఒక పాజిటివ్‌ ఎనర్జీని పొందడానికి చాలా కష్టపడ్డా. ఇప్పుడు మాత్రం ఒంటరి అనే భావన పూర్తిగా పోయింది. ప్రతి చిన్న విషయానికి కుంగిపోకుండా.. పాజిటివ్‌ మైండ్‌తో ఉండడం నేర్చుకున్నా. మనం ఉన్నంతకాలం చిరునవ్వుతో బతకాలి.. ఈ జీవితం చాలా అందమైనది'' అంటూ ముగించాడు.

ఇక గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన యూఎస్‌ ఓపెన్‌లో నిక్‌ కిర్గియోస్‌ మూడో రౌండ్‌లో వెనుదిరిగి కన్నీటి పర్యంతమయ్యాడు. కాగా ఆరునెలల పాటు సుధీర్ఘ బ్రేక్‌ తీసుకున్న కిర్గియోస్‌.. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. సింగిల్స్‌లో ఆకట్టులేకపోయినప్పటికి డబుల్స్‌లో మాత్రం తాన​ఇస కొక్కినాకిస్‌తో కలిసి టైటిల్‌ను ఎగురేసుకుపోయాడు. కాగా ఫిబ్రవరి 11న విడుదల చేసిన ఏటీపీ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో నిక్‌ కిర్గియోస్‌ 38వ ర్యాంక్‌తో కెరీర్‌ బెస్ట్‌ అందుకున్నాడు.

చదవండి: 'పేరులోనే వ్లాదిమిర్‌.. ఉక్రెయిన్‌ తరపునే పోరాటమన్న బాక్సింగ్‌ లెజెండ్స్‌'

Ind Vs SL 1st T20I: అక్కడ ఉంది శ్రేయాస్‌ అయ్యర్‌.. డౌట్‌ అక్కర్లేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement