Kyrgios Helps Police Catch Man Threaten His Mother Allegedly Stole-Tesla - Sakshi
Sakshi News home page

Nick Kyrgios: టెన్నిస్‌ స్టార్‌ తల్లికి బెదిరింపులు.. తలకు తుపాకీ గురిపెట్టి

May 2 2023 4:56 PM | Updated on May 2 2023 5:13 PM

Kyrgios Helps Police Catch Man-Threaten His Mother Allegedly Stole-Tesla - Sakshi

ఆస్ట్రేలియన్‌ టెన్నిస్‌ స్టార్‌ నిక్‌ కిర్గియోస్‌ తల్లికి చేదు అనుభవం ఎదురైంది. ఒక ఆగంతకుడు బ్లాక్‌పాయింట్‌లో ఆమె తలకు తుపాకీ గురిపెట్టి కారును దొంగలించడం కలకలం రేపింది.  ఆస్ట్రేలియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌(ABC) వివరాల వెల్లడించింది.

కిర్గియోస్‌ తల్లి నొర్లాలియా టెస్లా కారులో షాపింగ్‌కు వెళ్లినట్లు సమాచారం. అయితే ఆమె కారుకు ఒక దుండగుడు అడ్డు వచ్చాడు. కారు ఆపి ప్రశ్నించేలోపే దుండగుడు నొర్లాలియా తలకు తుపాకీ గురిపెట్టాడు. టెస్లా కారు తాళాలు ఇవ్వమని బెదిరించాడు. దీంతో నొర్లాలియా భయపడిపోయి పక్కకు తప్పుకోవడంతో సదరు దుండగుడు కారుతో ఉడాయించాడు.

ఆ తర్వాత నొర్లాలియా పోలీసులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న కిర్గియోస్‌ తల్లిని కలిసి జరిగిందంతా తెలుసుకున్నాడు. అయితే  తన ఫోన్‌లో ఉన్న యాప్‌ సాయంతో కారు ఎక్కడుందో కనుక్కోగలిగాడు. సకాలంలో పోలీసులు అక్కడికి చేరుకొని కారును స్వాధీనం చేసుకొని.. దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.

చదవండి: Serena Williams: రెండోసారి తల్లికాబోతున్న సెరీనా.. రెడ్‌ కార్పెట్‌పై బేబీ బంప్‌తో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement