world no 1
-
యాపిల్ సరికొత్త రికార్డ్.. మైక్రోసాఫ్ట్‌ను వెనక్కు నెట్టి..
ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ సంస్థను అధిగ మించిన ఆ స్థానాన్ని దక్కించుకుంది. కొన్ని వారాలకు ముందు ఎన్విడియా షేర్స్ పెరగడంతో యాపిల్ రెండో స్థానాన్ని కూడా కోల్పోయి మూడో స్థానంలో చేరింది. ఇప్పుడు ఒకేసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది.ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ అమ్మకాలు పెరడం, యాపిల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించడం వంటివి కంపెనీ షేర్లను భారీగా పెంచాయి. సంస్థ షేర్ ధర నాలుగు శాతం పెరిగి 215.04 డాలర్లకు చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 3.29 ట్రిలియన్ డాలర్లకు చేరింది.యాపిల్ కంపెనీ షేర్స్ పెరిగిన సమయంలో.. మైక్రోసాఫ్ట్ షేర్స్ తగ్గుముఖం పట్టాయి. షేర్ వాల్యూ తగ్గడంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్ 3.24 ట్రిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఇది మొదటి స్థానాన్ని కోల్పోయింది. యాపిల్ షేర్ పెరగటానికి డబ్ల్యుడబ్ల్యుడీసీ 2024 ప్రధాన కారణమని తెలుస్తోంది. -
మళ్లీ నంబర్‌వన్‌గా బోపన్న.. తన రికార్డు తానే తిరగరాసుకున్నాడు
ఫ్లోరిడా: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. గతవారం రెండో ర్యాంక్‌లో నిలిచిన 44 ఏళ్ల రోహన్ బోపన్న తన భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో సోమ వారం విడుదల చేసిన ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో బోపన్న ఒక స్థానం మెరుగుపర్చుకొని టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ సుమిత్ నగాల్ కెరీర్ బెస్ట్ 95వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. గత వారం 97వ ర్యాంక్‌లో నిలిచిన సుమిత్ రెండు స్థానాలు పురో గతి సాధించాడు. భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్ 61 స్థానాలు ఎగబాకి 349వ ర్యాంక్‌లో నిలిచాడు. -
Ashleigh Barty: బార్టీ బై..బై..!
అంతర్జాతీయ టెన్నిస్‌లో అనూహ్య పరిణామం... వరల్డ్ నంబర్‌వన్‌గా వెలుగొందుతున్న వేళ ఆస్ట్రేలియా మహిళా టెన్నిస్ స్టార్ యాష్లే బార్టీ సంచలన ప్రకటన... ఆడింది చాలని, కోర్టు బయట చేయాల్సింది చాలా ఉందంటూ టెన్నిస్‌కు గుడ్‌బై... సొంతగడ్డపై 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తొలి క్రీడాకారిణిగా రికార్డు సాధించి రెండు నెలలు కూడా గడవక ముందే రాకెట్‌ను పక్కన పెట్టేయాలని నిర్ణయం... మున్ముందు మరెంతో సాధించాల్సి ఉందంటూ క్రీడాకారులు లక్ష్యాలు పెట్టుకునే 25 ఏళ్ల వయసులోనే బార్టీ ఆటకు వీడ్కోలు పలకడం అసాధారణం! బ్రిస్బేన్: మహిళల టెన్నిస్ వరల్డ్ నంబర్‌వన్, మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత యాష్లే బార్టీ టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తన మాజీ డబుల్స్ భాగస్వామి కేసీ డెలాక్వాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఇకపై టెన్నిస్‌లో ఏదైనా సాధించాలనే తపన తనలో తగ్గిందని, అందుకు తగిన ప్రేరణ లభించకపోవడం కూడా రిటైర్మెంట్ కు కారణమని బార్టీ స్పష్టం చేసింది. 25 ఏళ్ల బార్టీ గత రెండేళ్లకు పైగా (114 వారాలు) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ► బార్టీ గెలిచిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్. సింగిల్స్‌లో 2019 ఫ్రెంచ్ ఓపెన్, 2021 వింబుల్డన్, 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్... డబుల్స్‌లో 2018 యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించింది. ► బార్టీ సాధించిన మొత్తం టైటిల్స్. (సింగిల్స్‌లో 15, డబుల్స్‌లో 12) తన ప్రొఫెషనల్ సింగిల్స్ కెరీర్లో బార్టీ గెలిచిన మ్యాచ్‌లు. ► 2,38,29,071 డాలర్లు (రూ. 182 కోట్లు) కెరీర్ మొత్తంలో బార్టీ గెలిచిన ప్రైజ్‌మనీ ఈ ఏడాది జనవరి 29న స్వదేశంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించిన బార్టీ ఆ తర్వాత మరే టోర్నీలోనూ బరిలోకి దిగలేదు. 2008లో జస్టిన్ హెనిన్ (బెల్జియం) కూడా ఇదే తరహాలో వరల్డ్ నంబర్‌వన్‌గా ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించింది. బార్టీ నిర్ణయం ప్రపంచ టెన్నిస్‌ను నిర్ఘాంతపరచింది. సహచర ప్లేయర్లు, మాజీలు, అభిమానులు ఈ ప్రకటన పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమె సరైన నిర్ణయం తీసుకుందని పలువురు అభినందనలు తెలుపగా... కొన్నాళ్ల తర్వాత బార్టీ పునరాగమనం చేస్తుందని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో కూడా ఒకసారి టెన్నిస్‌కు నిరవధిక విరామం ఇచ్చి క్రికెట్‌వైపు వెళ్లిన బార్టీ ఆ తర్వాత మళ్లీ రాకెట్ పట్టి ఆపై వరుస విజయాలు సాధించింది. కొంత కష్టంగానే అనిపిస్తున్నప్పటికీ భావోద్వేగంతో నా రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటిస్తున్నాను. టెన్నిస్ నాకు ఎంతో ఇచ్చింది. గర్వంగా, ఎంతో సాధించిన సంతృప్తితో ఆటను వీడుతున్నా. జీవితకాల జ్ఞాపకాలను నాతో పదిలంగా ఉంచుకుంటా. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. ఎన్నో సాధించిన తర్వాత శారీరకంగా, మానసికంగా కూడా నన్ను ఆట ఉత్తేజపరచడం లేదు. నేను టెన్నిస్‌లో చేయగలిగిందంతా చేశాను. కొత్త కలలను నెరవేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నిర్ణయం సరైందా, కాదా అనే చర్చ అనవసరం. ఇది నాకు నచ్చినట్లుగా నేను తీసుకున్న నిర్ణయం. వింబుల్డన్ సాధించాలనే నా లక్ష్యం. అది నెరవేరినప్పుడే ఇక చాలని అనిపించింది. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ రూపంలో మరో సవాల్ వచ్చింది. ఆ విజయం నా అద్భుత ప్రయాణానికి తగిన ముగింపుగా భావిస్తున్నా. –యాష్లే బార్టీ చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. View this post on Instagram A post shared by Ash Barty (@ashbarty) 🖤💛❤️ The moment Evonne Goolagong Cawley crowned @ashbarty the #AusOpen women's singles champion 🏆#AO2022 pic.twitter.com/ASBtI8xHjg — #AusOpen (@AustralianOpen) January 29, 2022 -
వరల్డ్ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్: నంబర్‌వన్‌గా పాయస్ జైన్
భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) యువతార పాయస్ జైన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీటీ సమాఖ్య ప్రపంచ ర్యాంకింగ్స్ అండర్–17 బాలుర సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఇటీవల పాయస్ జైన్ మూడు అంతర్జాతీయ టైటిల్స్ సాధించాడు. మానవ్ ఠక్కర్ (అండర్–21) తర్వాత ఐటీటీఎఫ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ గా నిలిచిన రెండో భారతీయ ప్లేయర్ పాయస్ జైన్ కావడం విశేషం. వాల్ట్ ఈవెంట్లో అరుణా రెడ్డికి 11వ స్థానం ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి వాల్ట్ ఈవెంట్ ఫైనల్ ఈవెంట్‌కు అర్హత పొందలేకపోయింది. జపాన్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో అరుణా రెడ్డి క్వాలిఫయింగ్‌లో 13.353 పాయింట్లు స్కోరు చేసి 11వ స్థానంలో నిలిచింది. టాప్–8లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్ లభిస్తుంది. అరుణ మూడో రిజర్వ్‌గా ఉంది. టాప్–8 నుంచి ముగ్గురు వైదొలిగితే అరుణా రెడ్డికి ఫైనల్లో పోటీపడే అవకాశం లభిస్తుంది. చదవండి: Virat Kohli: టీమిండియా కెప్టెన్‌కు మరో అరుదైన గౌరవం.. -
ఫెడరర్... మళ్లీ నంబర్‌వన్
స్టుట్గార్ట్ (జర్మనీ): స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఈ ఏడాది రెండోసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకోనున్నాడు. మెర్సిడెస్ ఓపెన్ టోర్నీలో ఫెడరర్ ఫైనల్‌కు చేరుకోవడంతో అతనికి నంబర్‌వన్ ర్యాంక్ ఖాయమైంది. సోమవా రం విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్‌లో ఫెడరర్ అధికారికంగా నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకుంటాడు. 2012 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో టాప్ ర్యాంక్ అందుకున్న ఫెడరర్... మే 14న స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్కు ఈ స్థానాన్ని కోల్పోయాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఫెడరర్ 6–7 (2/7), 6–2, 7–6 (7/5)తో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)తో ఫెడరర్ ఆడతాడు. -
రోజర్ ఫెదరర్ మళ్లీ అగ్రపీఠం
-
ఫెదరర్ 'లేటు వయసు' రికార్డు
స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ మళ్లీ అగ్రపీఠం అధిరోహించాడు. ఏటీపీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఈ టెన్నిస్ దిగ్గజం నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచాడు. నెదర్లాండ్స్‌లో రోటర్ డ్యామ్ ఓపెన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో నెగ్గిన ఫెదరర్ తర్వాత ఫెదరర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఫలితంగా 36 ఏళ్ల వయసులో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన టెన్నిస్ ఆటగాడిగా ఫెదరర్ రికార్డు సృష్టించాడు. గతంలో రోజర్ వరుసగా 302 వారాల పాటు అగ్రస్థానంలో కొనసాగాడు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు రోజర్ ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. 36 ఏళ్ల వయసులో అగ్రస్థానం సాధించిన ఫెదరర్.. మాజీ టెన్నిస్ ఆటగాడు ఆండ్రీ ఆగస్సీ రికార్డును సవరించించాడు. అంతకముందు ఆగస్సీ 33ఏళ్ల 131 రోజుల వయసులో టాప్ ర్యాంకును అందిపుచ్చుకోగా, ఆ తర్వాత లేటు వయసులో ప్రథమస్థానాన్ని దక్కించుకున్న తొలి ఆటగాడు ఫెదరర్ కావడం విశేషం. దీనిలో భాగంగా డ్యామ్ ఓపెన్ టోర్నో నిర్వాహకులు మ్యాచ్ అనంతరం ఫెదరర్‌కు ప్రత్యేక ట్రోపీని అందించారు. క్రీడల్లో నెంబర్ వన్ స్థానానికి రావడం అతిపెద్ద సక్సెస్ అని ఫెదరర్ ఈ సందర్భంగా తెలిపారు. -
ఇండియన్ ఓపెన్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన సైనా
హైదరాబాద్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించిన ఉత్సాహంలో ఉన్న సైనా.. వరుస సెట్లలో జపాన్‌కు చెందిన ప్రత్యర్థి యుకి హషిమొటోను ఓడించింది. మొదటి సెట్‌ను అలవోగా 21-15తో గెలుచుకున్న సైనా, రెండో సెట్లో ప్రత్యర్థికి ఆమాత్రం అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ సెట్‌ను 21- 11 తేడాతో గెలుచుకుని నేరుగా ఫైనల్స్‌లోకి వెళ్లింది. ఈ మ్యాచ్ కేవలం 43 నిమిషాల్లోనే ముగిసింది. ఫైనల్స్‌లో ఆమె థాయ్‌లాండ్‌కు చెందిన ప్రపంచ నెంబర్ 3 ర్యాంకర్ ఇలనాన్ రచానోను ఢీకొంటుంది.