ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ సంస్థను అధిగ మించిన ఆ స్థానాన్ని దక్కించుకుంది. కొన్ని వారాలకు ముందు ఎన్విడియా షేర్స్ పెరగడంతో యాపిల్ రెండో స్థానాన్ని కూడా కోల్పోయి మూడో స్థానంలో చేరింది. ఇప్పుడు ఒకేసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ అమ్మకాలు పెరడం, యాపిల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించడం వంటివి కంపెనీ షేర్లను భారీగా పెంచాయి. సంస్థ షేర్ ధర నాలుగు శాతం పెరిగి 215.04 డాలర్లకు చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 3.29 ట్రిలియన్ డాలర్లకు చేరింది.
యాపిల్ కంపెనీ షేర్స్ పెరిగిన సమయంలో.. మైక్రోసాఫ్ట్ షేర్స్ తగ్గుముఖం పట్టాయి. షేర్ వాల్యూ తగ్గడంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్ 3.24 ట్రిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఇది మొదటి స్థానాన్ని కోల్పోయింది. యాపిల్ షేర్ పెరగటానికి డబ్ల్యుడబ్ల్యుడీసీ 2024 ప్రధాన కారణమని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment