వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌: నంబర్‌వన్‌గా పాయస్‌ జైన్‌ | Table Tennis: Payas Jain becomes World No1 in U17 category | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌: నంబర్‌వన్‌గా పాయస్‌ జైన్‌

Published Wed, Oct 20 2021 8:57 AM | Last Updated on Wed, Oct 20 2021 8:57 AM

Table Tennis: Payas Jain becomes World No1 in U17 category - Sakshi

భారత టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) యువతార పాయస్‌ జైన్‌ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీటీ సమాఖ్య ప్రపంచ ర్యాంకింగ్స్‌ అండర్‌–17 బాలుర సింగిల్స్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఇటీవల పాయస్‌ జైన్‌ మూడు అంతర్జాతీయ టైటిల్స్‌ సాధించాడు. మానవ్‌ ఠక్కర్‌ (అండర్‌–21) తర్వాత ఐటీటీఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ గా నిలిచిన రెండో భారతీయ ప్లేయర్‌ పాయస్‌ జైన్‌ కావడం విశేషం. 

వాల్ట్‌ ఈవెంట్‌లో అరుణా రెడ్డికి 11వ స్థానం 
ప్రపంచ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ జిమ్నాస్ట్‌ బుద్దా అరుణా రెడ్డి వాల్ట్‌ ఈవెంట్‌ ఫైనల్‌ ఈవెంట్‌కు అర్హత పొందలేకపోయింది. జపాన్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో అరుణా రెడ్డి క్వాలిఫయింగ్‌లో 13.353 పాయింట్లు స్కోరు చేసి 11వ స్థానంలో నిలిచింది. టాప్‌–8లో నిలిచిన వారికి ఫైనల్‌ బెర్త్‌ లభిస్తుంది. అరుణ  మూడో రిజర్వ్‌గా ఉంది. టాప్‌–8 నుంచి ముగ్గురు వైదొలిగితే అరుణా రెడ్డికి ఫైనల్లో పోటీపడే అవకాశం లభిస్తుంది.

చదవండి: Virat Kohli: టీమిండియా కెప్టెన్‌కు మరో అరుదైన గౌరవం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement