నెంబర్ వన్ ట్రోపీతో ఫెదరర్
స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ మళ్లీ అగ్రపీఠం అధిరోహించాడు. ఏటీపీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఈ టెన్నిస్ దిగ్గజం నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచాడు. నెదర్లాండ్స్‌లో రోటర్ డ్యామ్ ఓపెన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో నెగ్గిన ఫెదరర్ తర్వాత ఫెదరర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఫలితంగా 36 ఏళ్ల వయసులో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన టెన్నిస్ ఆటగాడిగా ఫెదరర్ రికార్డు సృష్టించాడు.
గతంలో రోజర్ వరుసగా 302 వారాల పాటు అగ్రస్థానంలో కొనసాగాడు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు రోజర్ ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. 36 ఏళ్ల వయసులో అగ్రస్థానం సాధించిన ఫెదరర్.. మాజీ టెన్నిస్ ఆటగాడు ఆండ్రీ ఆగస్సీ రికార్డును సవరించించాడు. అంతకముందు ఆగస్సీ 33ఏళ్ల 131 రోజుల వయసులో టాప్ ర్యాంకును అందిపుచ్చుకోగా, ఆ తర్వాత లేటు వయసులో ప్రథమస్థానాన్ని దక్కించుకున్న తొలి ఆటగాడు ఫెదరర్ కావడం విశేషం. దీనిలో భాగంగా డ్యామ్ ఓపెన్ టోర్నో నిర్వాహకులు మ్యాచ్ అనంతరం ఫెదరర్‌కు ప్రత్యేక ట్రోపీని అందించారు. క్రీడల్లో నెంబర్ వన్ స్థానానికి రావడం అతిపెద్ద సక్సెస్ అని ఫెదరర్ ఈ సందర్భంగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment