ఇండియన్ ఓపెన్ ఫైనల్స్లోకి దూసుకెళ్లిన సైనా | saina nehwal eneters indian open super series finals | Sakshi
Sakshi News home page

ఇండియన్ ఓపెన్ ఫైనల్స్లోకి దూసుకెళ్లిన సైనా

Published Sat, Mar 28 2015 6:36 PM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

saina nehwal eneters indian open super series finals

హైదరాబాద్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించిన ఉత్సాహంలో ఉన్న సైనా.. వరుస సెట్లలో జపాన్కు చెందిన ప్రత్యర్థి యుకి హషిమొటోను ఓడించింది. మొదటి సెట్ను అలవోగా 21-15తో గెలుచుకున్న సైనా, రెండో సెట్లో ప్రత్యర్థికి ఆమాత్రం అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ సెట్ను 21- 11 తేడాతో గెలుచుకుని నేరుగా ఫైనల్స్లోకి వెళ్లింది. ఈ మ్యాచ్ కేవలం 43 నిమిషాల్లోనే ముగిసింది. ఫైనల్స్లో ఆమె థాయ్లాండ్కు చెందిన ప్రపంచ నెంబర్ 3 ర్యాంకర్ ఇలనాన్ రచానోను ఢీకొంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement