women Badminton
-
‘ఆసియా’ ఫైనల్లో తస్నిమ్, తార
సురబాయ (ఇండోనేసియా): ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ బాలికల అండర్–15 సింగి ల్స్ విభాగంలో భారత్‌కు టైటిల్ లభించడం ఖాయమైంది. ఈ విభాగంలో ఫైనల్ చేరిన ఇద్దరు క్రీడాకారిణులు తస్నిమ్ మీర్, తారా షా భారత్‌కే చెందిన వారు కావడం విశేషం. శనివారం జరిగిన అండర్–15 బాలికల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో తస్నిమ్ 21–16, 21–11తో సోరా ఇషియోకా (జపాన్)పై... తారా షా 21–18, 21–14తో కజునె ఇవాటో (జపాన్)పై విజయం సాధించారు. చరిత్రకు విజయం దూరంలో... గ్వాంగ్జౌ (చైనా): మరో విజయం సాధిస్తే జపాన్ స్టార్ కెంటో మొమోటా... బ్యాడ్మింటన్ చరిత్రలో ఒకే ఏడాది అత్యధికంగా 11 టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ మొమోటా టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మొమోటా 21–17, 21–12తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై గెలిచాడు. మరో సెమీఫైనల్లో ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా) 21–15, 21–15తో రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో జిన్‌టింగ్‌తో మొమోటా తలపడతాడు. -
ఇండియన్ ఓపెన్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన సైనా
హైదరాబాద్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించిన ఉత్సాహంలో ఉన్న సైనా.. వరుస సెట్లలో జపాన్‌కు చెందిన ప్రత్యర్థి యుకి హషిమొటోను ఓడించింది. మొదటి సెట్‌ను అలవోగా 21-15తో గెలుచుకున్న సైనా, రెండో సెట్లో ప్రత్యర్థికి ఆమాత్రం అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ సెట్‌ను 21- 11 తేడాతో గెలుచుకుని నేరుగా ఫైనల్స్‌లోకి వెళ్లింది. ఈ మ్యాచ్ కేవలం 43 నిమిషాల్లోనే ముగిసింది. ఫైనల్స్‌లో ఆమె థాయ్‌లాండ్‌కు చెందిన ప్రపంచ నెంబర్ 3 ర్యాంకర్ ఇలనాన్ రచానోను ఢీకొంటుంది. -
ఉస్మానియా ‘డబుల్’
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జట్లు రాణించాయి. మహిళల బ్యాడ్మింటన్, వాలీబాల్ పోటీల్లో విజేతగా నిలిచాయి. పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ టైటిల్ ను హైదరాబాద్‌కు చెందిన జేఎన్టీయూ జట్టు గెలుచుకుంది. ఒడిషాలోని కేఐటీ యూనివర్సిటీలో ఈనెల 7 నుంచి 12 వరకు ఈ పోటీలు జరిగాయి. మహిళల బ్యాడ్మింటన్ టీమ్ విభాగం ఫైనల్లో ఓయూ 2-1తో డీఏవీ ఇండోర్ జట్టుపై విజయం సాధించింది. సింగిల్స్ మ్యాచ్‌లో పూజా (ఓయూ) 19-21, 11-21స్కోరుతో నజ్మా ఖాన్ (డీఏవీ) చేతిలో ఓడిపోయింది. డబుల్స్‌లో లీలా లక్ష్మీ, జమున రాణి జోడి(ఓయూ) 21-13, 21-14తో షాజియా ఖాన్, నజ్మా ఖాన్ జోడిపై గెలిచింది. రివర్స్ సింగిల్స్‌లో సి.హెచ్.పూర్ణిమ (ఓయూ) 22-20, 18-21, 21-14తో షాజియా ఖాన్‌పై నెగ్గింది. పురుషుల టీమ్ విభాగం ఫైనల్లో హైదరాబాద్ జేఎన్టీయూ 3-1తో ఓయూపై గెలిచింది. ఫైనల్లో తొలి సింగిల్స్‌లో విశాల్ రెడ్డి (జేఎన్టీయూ) 18-21, 17-21తో కిరణ్ మౌళి (ఓయూ)పై గెలిచాడు. రెండో సింగిల్స్ ఎన్.వి.ఎస్.విజేత (జేఎన్టీయూ) 21-12, 21-16తో అర్జున్ రెడ్డి(ఓయూ)పై గెలిచాడు. డబుల్స్‌లో విజేత, సంతోష్ జోడి (జేఎన్టీయూ) 21-13, 21-19తో ఆదిత్య, పూర్ణేందు జోడి(ఓయూ)పై గెలిచింది. రివర్స్ సింగిల్స్‌లో జయసింహారెడ్డి (జేఎన్టీయూ) 21-12, 21-13తో వేణుమాధవ్ (ఓయూ)పై నెగ్గాడు. వాలీవాల్ మహిళల విభాగం ఫైనల్లో ఓయూ జట్టు 25-14, 25-22, 25-17 స్కోరుతో ఎల్ఎన్ఐపీఈ (గ్వాలియర్)పై ఘన విజయం సాధించి సంచలనం సృషించింది. ఓయూ జట్టులో ప్రియా, శాంతి, సౌమ్యాలు చక్కటి ఆటతీరు ప్రదర్శించి తమ జట్టుకు విజయాన్ని అందించారు.