ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జట్లు రాణించాయి. మహిళల బ్యాడ్మింటన్, వాలీబాల్ పోటీల్లో విజేతగా నిలిచాయి. పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ టైటిల్ ను హైదరాబాద్‌కు చెందిన జేఎన్‌టీయూ జట్టు గెలుచుకుంది. ఒడిషాలోని కేఐటీ యూనివర్సిటీలో ఈనెల 7 నుంచి 12 వరకు ఈ పోటీలు జరిగాయి. మహిళల బ్యాడ్మింటన్ టీమ్ విభాగం ఫైనల్లో ఓయూ 2-1తో డీఏవీ ఇండోర్ జట్టుపై విజయం సాధించింది. సింగిల్స్ మ్యాచ్‌లో పూజా (ఓయూ) 19-21, 11-21స్కోరుతో నజ్మా ఖాన్ (డీఏవీ) చేతిలో ఓడిపోయింది.
డబుల్స్‌లో లీలా లక్ష్మీ, జమున రాణి జోడి(ఓయూ) 21-13, 21-14తో షాజియా ఖాన్, నజ్మా ఖాన్ జోడిపై గెలిచింది. రివర్స్ సింగిల్స్‌లో సి.హెచ్.పూర్ణిమ (ఓయూ) 22-20, 18-21, 21-14తో షాజియా ఖాన్‌పై నెగ్గింది. పురుషుల టీమ్ విభాగం ఫైనల్లో హైదరాబాద్ జేఎన్‌టీయూ 3-1తో ఓయూపై గెలిచింది. ఫైనల్లో తొలి సింగిల్స్‌లో విశాల్ రెడ్డి (జేఎన్‌టీయూ) 18-21, 17-21తో కిరణ్ మౌళి (ఓయూ)పై గెలిచాడు. రెండో సింగిల్స్ ఎన్.వి.ఎస్.విజేత (జేఎన్‌టీయూ) 21-12, 21-16తో అర్జున్ రెడ్డి(ఓయూ)పై గెలిచాడు.
డబుల్స్‌లో విజేత, సంతోష్ జోడి (జేఎన్‌టీయూ) 21-13, 21-19తో ఆదిత్య, పూర్ణేందు జోడి(ఓయూ)పై గెలిచింది. రివర్స్ సింగిల్స్‌లో జయసింహారెడ్డి (జేఎన్‌టీయూ) 21-12, 21-13తో వేణుమాధవ్ (ఓయూ)పై నెగ్గాడు. వాలీవాల్ మహిళల విభాగం ఫైనల్లో ఓయూ జట్టు 25-14, 25-22, 25-17 స్కోరుతో ఎల్‌ఎన్‌ఐపీఈ (గ్వాలియర్)పై ఘన విజయం సాధించి సంచలనం సృషించింది. ఓయూ జట్టులో ప్రియా, శాంతి, సౌమ్యాలు చక్కటి ఆటతీరు ప్రదర్శించి తమ జట్టుకు విజయాన్ని అందించారు.
ఉస్మానియా ‘డబుల్’
Published Tue, Oct 15 2013 11:45 PM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM
Advertisement